ధర రూ.13,999 కే 108MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్.. AI ఫీచర్లు, OTT సబ్‌స్క్రిప్షన్ ఉచితం..!
టెక్నో మొబైల్స్ ఇవాళ భారత్‌లో టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ (Tecno Pova 6 Neo 5G Smartphone) చేసింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఈ టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కలిగి ఉంది. మరియు 108MP ప్రైమరీ కెమెరా సహా AI కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ తేదీ సహా ఇతర ఆఫర్ల వివరాలను కూడా వెల్లడించింది. అత్యంత తక్కువ ధరకే విడుదల చేసింది.
టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల (1600*720 పిక్సల్ రిజల్యూషన్) HD+ LCD డిస్‌ప్లేతో లాంచ్ అయింది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 90 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 240 టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది.

ఈ టెక్నో హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. మరియు Mail G57 MC2 GPU, LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB, 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీ, 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో :
ఈ టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14.5 OS ను కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా f/1.89 అపేచర్‌తో 108MP కెమెరా, మరో AI లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్‌తో లాంచ్ అయింది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు.
ఈ టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది. AI కటౌట్, AI మేజిక్ ఎరేజర్, AI వాల్‌పేపర్, AIGC పొర్ట్రెయిట్, AI ఆర్ట్‌బోర్డ్, Ask AI ఫీచర్లును వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. 5 సంవత్సరాలపాటు ఈ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. మరియు కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.3, WiFi 802, USB-C, GPS, NFC వంటి ఫీచర్లను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్లు సహా 3.5mm ఆడియో జాక్, భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల ఎక్సేంజీ ద్వారా రూ.1000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ సేల్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. అజుర్ స్కై, మిడ్‌నైట్ షాడో, అరోరా క్లౌడ్ రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్ లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా సంస్థ రూ.6271 విలువైన OTTPlay సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఫలితంగా 27 ఓటీటీ ప్లాట్‌ఫాంలను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications