రూ.12999 ధరకే 108MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్.. 5000mAh బ్యాటరీ, AI ఫీచర్లు..!
టెక్నో ఇటీవల కాలంలో అనేక మోడల్స్ ను లాంచ్ చేస్తోంది. సెప్టెంబర్ నెలలో అత్యంత సన్నని డిస్‌ప్లేతో కూడిన ఫోన్ ను లాంచ్ చేస్తామని ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ ఫోన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. గత సంవత్సరం విడుదల అయిన టెక్నో పోవా 6 నియో 5G స్మా్ర్ట్ ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 108MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల వివరాలు.
టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ ( Tecno Pova 6 Neo Smartphone ) విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు :
ప్రస్తుతం అమెజాన్‌లో 6GB/ 128GB వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. అంటే రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదే 8GB/ 256GB వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. ఈ వేరియంట్ పై రూ.1000 కూపన్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఫలితంగా రూ.12999 కే సొంతం చేసుకోవచ్చు.
కలర్ వేరియంట్స్ :
టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ అరోరా క్లౌడ్, అజుర్ స్క్రై, మిడ్‌నైట్ షాడో కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, Mail G57 MC2 GPUను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14.5 OS పైన పనిచేస్తోంది.
108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా 108MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో AI లెన్స్ ను కలిగి ఉంది. వెనుక వైపు డ్యూయల్ LED ఫ్లా్ష్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ టెక్నో హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) ఫీచర్ లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సా్ర్ ను కలిగి ఉంది. IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్, GPS, NFC ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








