ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో (Tecno Pova 6 Pro 5G Smartphone Launched) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు 108MP కెమెరా మరియు ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు రెండు ర్యామ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పోవా 6 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. మరియు డిజైన్ పరంగా అద్భుతంగా ఉంది. దీంతోపాటు మెరుగైన ఫీచర్లతో లాంచ్ అయింది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 పైన పనిచేస్తుంది. మరియు 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 12GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. అదనంగా 12GB వరకు వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. అదే 8GB ర్యామ్ వేరియంట్ అదనంగా మరో 8GB వరకు పొడిగించుకోవచ్చు.
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 3X జూమ్ సామర్థ్యంతో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP పొర్ట్రెయిట్ కెమెరా సహా మరో AI ఆధారిత కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంది.

దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను కలిగి ఉంటుంది. డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ టెక్నో కొత్త ఫోన్ 70W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ ఫోన్ డైనమిక్ పోర్ట్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. నోటిఫికేషన్ మరియు ఛార్జింగ్, కాల్స్ వివరాలు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఆర్క్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. వెనుక కెమెరా యూనిట్ దగ్గర గుర్తించవచ్చు. 200 LEDలు, 100 కంటే ఎక్కువ కస్టమైజేషన్‌లు కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది.
టెక్నో పోవో 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పోవో 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ధరలు వరసగా రూ.17,999 మరియు రూ.19,999 గా ఉంటాయి. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుపై రూ.4999 విలువైన టెక్నో S2 స్పీకర్‌ను ఉచితంగా పొందవచ్చు. కామెట్ గ్రీన్, మెటీరియోరైట్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
కనెక్టివిటీ పరంగా టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వైఫై, బ్లూటూత్, NFC, GPS మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయింది. ఈ పోవా 6 ప్రో 5G హ్యాండ్‌సెట్ 195 గ్రాములు బరువును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








