6000mAh బ్యాటరీ, 108MP కెమెరా స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది.. రూ.4999 విలువైన స్పీకర్ ఉచితం..!
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయింది. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్, ఇతర స్టోర్‌ల ద్వారా (Tecno Pova 6 Pro 5G smartphone sale) కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లు 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ ధర రూ.21,999 గా ఉంది.

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రెండు వేరియంట్‌లపై రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్ వేరియంట్‌ను రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు. మరియు హైఎండ్ వేరియంట్‌ను రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు రూ.4999 విలువైన టెక్నో S2 స్పీకర్‌ను ఉచితంగా పొందవచ్చు.
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. ఈ ఫోన్ డైనమిక్ పోర్ట్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. నోటిఫికేషన్ మరియు ఛార్జింగ్, కాల్స్ వివరాలు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 పైన పనిచేస్తుంది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 12GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. అదనంగా 12GB వరకు వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు. అదే 8GB ర్యామ్ వేరియంట్ అదనంగా మరో 8GB వరకు పొడిగించుకోవచ్చు. ఈ టెక్నో కొత్త ఫోన్ 70W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 3X జూమ్ సామర్థ్యంతో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 2MP పొర్ట్రెయిట్ కెమెరా సహా మరో AI ఆధారిత కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంది. 32MP కెమెరాను కలిగి ఉంటుంది. డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వైఫై, బ్లూటూత్, NFC, GPS మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయింది. ఈ పోవా 6 ప్రో 5G హ్యాండ్‌సెట్ 195 గ్రాములు బరువును కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications