Home
Mobile

6000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు..!

టెక్నో సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ టెక్నో పోవా 6 ప్రో 5G (Tecno Pova 6 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్‌ (MWC) 2024 వేదికగా ఈ హ్యండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 70W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు ట్రిపుల్ కెమెరా, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Tecno New Smartphone) గత సంవత్సరం లాంచ్ అయిన టెక్నో పోవా 5 ప్రో హ్యాండ్‌సెట్‌కు తర్వాత వెర్షన్‌గా ఉంది. మరియు ఈ కొత్త ఫోన్‌ కామెట్‌ గ్రీన్‌, మెటీరియోరైట్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Tecno Pova 6 Pro 5G Smartphone unveiled

టెక్నో పోవా 6 ప్రో 5G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ HiOS 14 OS పైన పనిచేస్తుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 2160Hz PWM డిమ్మింగ్‌తో వస్తుంది.

టెక్నో పోవా 6 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్ 12GB ర్యామ్‌ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడింది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 27,342mm కూలింగ్‌ ఏరియాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ-స్పోర్ట్స్‌ ప్రో ఆపరేషన్‌ ఇంజిన్‌ మరియు 4D వైబ్రేషన్‌తో వస్తుంది.

Tecno Pova 6 Pro 5G Smartphone unveiled

108MP ప్రధాన కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా : ఈ టెక్నో కొత్త ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రధాన కెమెరా సహా ఇతర కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 32MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌తో వస్తుంది.

ఈ సౌండ్‌ సిస్టమ్‌ కలిగి ఉన్న తొలి టెక్నో ఫోన్‌ ఇదే : డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ను కలిగి ఉన్న తొలి టెక్నో ఫోన్‌గా Pova 6 Pro 5G నిలిచిందని సంస్థ పేర్కొంది. మరియు వెనుక ప్యానల్‌లో డైనమిక్‌ మిని ఎల్‌ఈడీని కలిగి ఉంటుంది. కాల్స్‌, పవర్‌ స్టేటస్‌, గేమింగ్‌, మ్యూజిక్‌ వంటి సమయాల్లో కస్టమైజిడ్‌గా వస్తుంది.

Tecno Pova 6 Pro 5G Smartphone unveiled

ఈ టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 70W ఛార్జింగ్‌ మరియు 10W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. 20 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుంది. మరియు 50 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.

దీంతోపాటు మరిన్ని వివరాలను సంస్థ వెల్లడించింది. 11 గంటలపాటు గేమింగ్‌ లేదా 14 గంటలపాటు వీడియో స్టీమింగ్‌ లేదా 31 గంటల కంటే ఎక్కువ కాలింగ్‌ సమయాన్ని సింగిల్‌ ఛార్జింగ్‌తో పొందవచ్చని టెక్నో వెల్లడించింది. ఈ టెక్నో పోవా 6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 7.88mm థిక్‌నెస్‌, 195 గ్రాముల బరువు ఉంది. ఈ ఫోన్‌ విడుదల తేదీ, ధర ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Tecno Pova 6 Pro 5G Smartphone unveiled with 6000mAh battery and 108MP Camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X