రూ.15 వేల కంటే తక్కువ ధరలో ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఇవాళ విడుదలయిన స్మార్ట్‌ఫోన్ గురించి తెలుసుకోండి..!
Tecno Pova 7 5G Series : టెక్నో పోవో 7 5G సిరీస్ భారత్ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో 7 5G, పోవో 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌లు భారీ డిస్‌ప్లేతోపాటు 8GB ర్యామ్‌ను కలిగి ఉన్నాయి. మరియు 6000mAh బ్యాటరీతో పనిచేస్తాయి. ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
* టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు Mali G615 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4X ర్యామ్, 128GB/256GB UFS 2.2 స్టోరేజీని జత చేసి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్స్‌తోపాటు రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తామని టెక్నో చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Ella AI అసిస్టెంట్ సపోర్టును కలిగి ఉంది. AI కాల్ అసిస్టెంట్, AI ఆటో ఆన్సర్, AI Voiceprint Noise Suppression వంటి ఫీచర్లున్నాయి.
కెమెరా విభాగం పరంగా f/1.6 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు. IR ను అమర్చి ఉంటుంది. 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 802.11ac, NFC వంటి ఫీచర్లున్నాయి.

* టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ను అమర్చారు. మరియు Mali G615 MC2 GPU ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5x ర్యామ్, 128GB/256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్స్‌తోపాటు రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తామని టెక్నో చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Ella AI అసిస్టెంట్ సపోర్టును కలిగి ఉంది. AI కాల్ అసిస్టెంట్, AI ఆటో ఆన్సర్, AI Voiceprint Noise Suppression వంటి ఫీచర్లున్నాయి.
కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G, బ్లూటూత్ 5.4, వైఫై 802.11 ac, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ IR ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
టెక్నో పోవా 7 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
టెక్నో పోవా 7 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. లిమిటెడ్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.12999, రూ.13999 కే కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. లిమిటెడ్ సేల్‌లో భాగంగా రూ.16999, రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు ఫోన్ల సేల్ జులై 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బేస్ మోడల్ మేజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, గీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. అదే ప్రో మోడల్ డైనమిక్ గ్రే, నియోన్ సియాన్, గీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








