రూ.12999 ధరకే 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో 5G ఫోన్.. సేల్ ప్రారంభం.. పూర్తి వివరాలు..!
Tecno Pova 7 5G Series Smartphones Sale : భారత్ మార్కెట్‌లో టెక్నో సంస్థ ఇటీవల టెక్నో పోవా 7 5G, పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్‌ల సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది. ఈ రెండు ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్స్ 6000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
లిమిటెడ్ సేల్‌లో భాగంగా తగ్గింపు ధర :
టెక్నో పోవా 7 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.15999 గా ఉంది. లిమిటెడ్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.12999, రూ.13999 కే కొనుగోలు చేయవచ్చు. అదే ప్రో మోడల్‌ను 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది.

కలర్ వేరియంట్స్ :
లిమిటెడ్ సేల్‌లో భాగంగా రూ.16999, రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టెక్నో పోవా 7 5G సిరీస్‌ను కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ మేజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, గీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్, ప్రో మోడల్ డైనమిక్ గ్రే, నియోన్ సియాన్, గీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్, Mali G615 MC2 GPU ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 ను కలిగి ఉంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
* టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్, Mali G615 MC2 GPU ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది.
6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. Ella AI అసిస్టెంట్‌ను కలిగి ఉంది. AI Voiceprint Noise Suppression, AI కాల్ అసిస్టెంట్, AI ఆటో ఆన్సర్ ఫీచర్లను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 802.11 ac, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








