రూ.13749 ధరకు 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, ఫుల్ HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!
టెక్నో ఈ సంవత్సరం జులై నెలలో టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova 7 5G Smartphone) భారత్ మార్కెట్లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ సహా ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP కెమెరాను కలిగి ఉంది. మూడు కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు.
విడుదల సమయంలో టెక్నో పోవా 7 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.15,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 8GB/128GB వేరియంట్ రూ.13,749 గా ఉంది.

డిస్కౌంట్ ఆఫర్ :
అంటే రూ.1249 తగ్గింపుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపు ధరకు పొందవచ్చు. ఈ టెక్నో హ్యాండ్‌సెట్ ను మేజిక్ సిల్వర్, గీక్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
144Hz రీఫ్రెష్ రేట్, ఫుల్ HD+ డిస్‌ప్లే :
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.
2 సంవత్సరాల అప్‌డేట్స్ :
టెక్నో హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీంతోపాటు Mali G615 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
6000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరా ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ అమర్చి ఉంది. ఈ ఫోన్ ముందు వైపు 13MP కెమెరాను అమర్చి ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ AI Auto answer, AI కాల్ అసిస్టెంట్, AI Voice print noise suppression ఫీచర్ ను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అసిస్టెంట్ Ella ను కూడా కలిగి ఉంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








