Home
Mobile

బడ్జెట్‌ ధరలో కర్వడ్‌ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ సహా ఆకట్టుకొనే డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌!

Tecno Pova Curve 2 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో నుంచి ఫిబ్రవరి 13 వ తేదీన పోవా కర్వ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఇటీవలే డిజైన్‌ సహా ఇతర వివరాలను సంస్థ వెల్లడించింది. గత సంవత్సరం విడుదల అయిన పోకో కర్వ్‌ 5G ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా కర్వ్‌ 2 5G మోడల్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ చిప్‌, భారీ బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

సరికొత్త డిజైన్‌ :
టెక్నో పోవా కర్వ్ 2 5G హ్యాండ్‌సెట్‌ సరికొత్త డిజైన్‌ ను కలిగి ఉంటుందని టెక్నో తెలిపింది. దీంతోపాటు ఇన్‌ హ్యాండ్‌ ఫీల్‌ అందించే విధంగా డిజైన్‌ ఉంటుందని చెబుతోంది. దీంతోపాటు సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. అదే వెనుక వైపు స్పేస్‌క్రాఫ్ట్‌ థ్రస్టర్‌లను పోలి ఉండేలా విలక్షణమైన డిజైన్‌తో కూడిన కెమెరా మాడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది.

Tecno Pova Curve 2 5G Smartphone

ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్‌ మార్కెట్‌లో ఈ ఫోన్ ఫిబ్రవరి 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ చిప్‌సెట్‌ సహా అనేక వివరాలను టెక్నో ఇటీవల వెల్లడించింది.

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ వివరాల ఆధారంగా పోవా కర్వ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం. గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుందని తెలుస్తోంది.

భారీ బ్యాటరీ! :
ఈ ఫోన్ మరో ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7750mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బడ్జెట్‌ ధరలో గరిష్ఠంగా 7000mAh బ్యాటరీ కలిగిన ఫోన్‌లు మాత్రమే ఉన్నాయి.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 13MP సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటందని తెలుస్తోంది. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.

ఈ హ్యాండ్‌సెట్‌ స్ట్రోమ్‌ టైటానియం, మెల్టింగ్‌ సిల్వర్‌, మిస్టిక్‌ పర్పుల్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌ లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ టెక్నో పోవా కర్వ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Pova Curve 2 5G Smartphone key specifications revealed ahead of launch on february 13 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X