Home
Mobile

8000mAh భారీ బ్యాటరీ, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, డ్రాప్‌ రెసిస్టెన్స్‌, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్!

Tecno Pova Curve 2 5G Smartphone : టెక్నో సంస్థ భారత్‌ మార్కెట్లో భారీ బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో పోవా కర్వ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లతోపాటు కనెక్టివిటీని మెరుగుపరిచే ఫీచర్లు కూడా ఉన్నాయి. భారీ బ్యాటరీని కలిగి ఉన్నా.. సన్నని డిజైన్‌నే కలిగి ఉంది. డ్రాప్‌ రెసిస్టెన్స్‌తో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

టెక్నో పోవా కర్వ్‌ 2 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్‌ HD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 429 PPI పిక్సల్ డెన్సిటీ, 93.1 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.

Tecno Pova Curve 2 5G smartphone sale

డ్రాప్‌ రెసిస్టెంట్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ 7.42 mm థిక్‌నెస్‌, 195 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5 స్టార్‌ డ్రాప్‌ రెసిస్టెంట్‌గా ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీ స్టోరేజీతో జతచేసి ఉంది. వర్చువల్‌ ర్యామ్ ఫీచర్‌తో ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. Arm G610 MC2 GPU ను కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత HiOS 16 పైన పనిచేస్తుంది.

Tecno Pova Curve 2 5G smartphone sale

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Ella AI సపోర్టును కలిగి ఉంది. హిందీ, మరాటీ సహా ఐదు స్థానిక భాషలను సపోర్టు చేస్తుంది. టచ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్ ఉంది. ఏఐ నాయిస్‌ రిడక్షన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

8000mAh భారీ బ్యాటరీ :
ఈ పోవా కర్వ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో ఏకంగా 8000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 16.4 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్ లేదా 35.7 మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ లేదా 48.1 గంటల కాలింగ్‌ టైం లేదా 1133.1 గంటల స్టాండ్‌బై టైంను అందిస్తుంది.

ఈ ఫోన్ G1 సిగ్నల్‌ చిప్‌, SE1 వైఫై చిప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 20.. 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది. నెట్‌వర్క్‌ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కూడా ఈ ఫోన్ ద్వారా కాల్స్‌ చేసుకోవచ్చని చెబుతోంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్పీకర్‌లను కలిగి ఉంది.

Tecno Pova Curve 2 5G smartphone sale

టెక్నో పోవా కర్వ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఫిబ్రవరి 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ మిస్టిక్ పర్పుల్‌, మెల్టింగ్‌ సిల్వర్‌, స్ట్రోమ్‌ టైటానియం కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Pova Curve 2 5G smartphone launched with 8000mAh battery, 144Hz Refresh Rate in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X