ఏకంగా 8000mAh బ్యాటరీ, సరికొత్త డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళే విడుదల..!
Tecno Pova Curve 2 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో నుంచి ఇవాళ పోవా కర్వ్ 2 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. గత సంవత్సరం లాంచ్ అయిన టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి రానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కర్వ్ 2 ఫోన్ విడుదల కానుంది.
ఈ లాంచ్ ఈవెంట్‌ను టెక్నో సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తోపాటు అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ప్రత్యేక డిజైన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్‌తో కూడిన స్పేస్ 2.0 డిజైన్‌గా టెక్నో చెబుతోంది. టెక్నో ఇండియా వెబ్‌సైట్ ఆధారంగా స్టార్‌షిప్ ప్రేరణతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 7.42mm థిక్‌నెస్‌తో 195 గ్రాముల బరువు ఉంటుంది.
8000mAh బ్యాటరీ :
పోవా కర్వ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 8000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భారత్ మార్కెట్‌లో రియల్‌మి P4 పవర్ 5G ఫోన్ 10001mAh బ్యాటరీ సామర్థ్యంతో తొలి స్థానంలో ఉండగా.. కర్వ్ 2 5G రెండో స్థానంలో నిలవనుంది. అయితే టెక్నో ఫోన్ ఛార్జింగ్ సామర్థ్యం వివరాలు విడుదల సమయంలో వెల్లడి కానున్నాయి. అయితే ఒక్కసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేసి రెండు రోజులపాటు వినియోగించుకోవచ్చని టెక్నో చెబుతోంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్ల అంచనా వివరాలు :
టెక్నో పోవా కర్వ్ 2 5G హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లను హానికలగకుండా ఉండేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు చెబుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.
కెమెరా మాడ్యూల్ కూడా ఆకట్టుకొనే విధంగా ఉంది. త్రిభుజాకార డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానల్ పోవా బ్రాండింగ్‌తోపాటు ఫైన్ ప్రింట్ టెక్స్ కూడా ఉంది. కెమెరాలతోపాటు LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కనెక్టివిటీని మెరుగుపరిచేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. కాలింగ్ సమయాల్లో కాల్ క్వాలిటీని మెరుగుపరిచేందుకు ఏఐ ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. బెస్ట్ డిజైన్, బెస్ట్ ఏఐ, బెస్ట్ సిగ్నల్‌ను అందిస్తామని చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంత ధరలో లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం విడుదల అయిన పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.15999 గా ఉంది.


Click it and Unblock the Notifications








