ఇవాళే 8000mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ సేల్.. రూ.3000 బ్యాంకు డిస్కౌంట్!
Tecno Pova Curve 2 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ టెక్నో భారత్ మార్కెట్లో ఇటీవల భారీ బ్యాటరీతో టెక్నో పోవా కర్వ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. కర్వడ్ డిస్‌ప్లే, డ్రాప్ రెసిస్టెన్స్, ఏఐ నాయిస్ రిడక్షన్ ఫీచర్‌లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ :
టెక్నో పోవా కర్వ్ 2 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది.

రూ.3000 డిస్కౌంట్ :
తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ మెల్టింగ్ సిల్వర్, మిస్టిక్ పర్పుల్, స్ట్రోమ్ టైటానియం కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంది.
కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే :
టెక్నో పోవా కర్వ్ 2 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 429 PPI పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Arm G610 MC2 GPU ను కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్ G1 సిగ్నల్ చిప్, SE1 వైఫై చిప్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఏకంగా 20 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుందని టెక్నో చెబుతోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13MP కెమెరాను అమర్చారు.

8000mAh భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 45W వైర్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 1133.1 గంటల స్టాండ్ బై టైంను పొందవచ్చని టెక్నో చెబుతోంది. ఈ ఫోన్ Ella AI ను సపోర్టు చేస్తుంది. ఐదు భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది.
5 స్టార్ డ్రాప్ రిసిస్టెంట్ :
దీంతోపాటు ఏఐ నాయిస్ రిడక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతోపాటు IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








