Home
Mobile

బడ్జెట్‌ ధరలో భారీ బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌.. ఎప్పుడు విడుదలకానుందంటే?

Tecno Pova Curve 2 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో భారత్‌ మార్కెట్‌లో కర్వ్‌ సిరీస్‌ నుంచి మరో ఫోన్‌ను తీసుకురానుంది. టెక్నో పోవా కర్వ్‌ 2 పేరుతో ఈ ఫోన్‌ విడుదల కానుంది. గతవారం ఈ ఫోన్‌ గురించి కొన్ని వివరాలు వెల్లడి కాగా.. తాజాగా విడుదల తేదీ సహా అనేక స్పెసిఫికేషన్‌లు వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో ఫిబ్రవరి 13 వ తేదీన విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. డబుల్‌ కర్వడ్‌ ఎడ్జ్‌లతో సహజమైన అనుభూతి కలిగేలా ఉంటుందని చెబుతోంది.

Tecno Pova curve 2 smartphone

ఈ పోవా కర్వ్ 2 స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు స్పేస్‌క్రాఫ్ట్‌ థ్రస్టర్‌ నుంచి ప్రేరణ పొందిన త్రిభుజాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇటీవల విడుదలైన వీడియో వైట్ కలర్‌ వేరియంట్‌లో కనిపించింది. కర్వడ్ డిస్‌ప్లే, రెడ్‌ బటన్‌ను గుర్తించవచ్చు. గూగుల్‌ ప్లే కన్సోల్‌, TUV సర్టిఫికేషన్‌ లిస్టింగ్‌ ఆధారంగా అనేక వివరాలు వెల్లడయ్యాయి.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ లిస్టింగ్‌ ఆధారంగా పోవో కర్వ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ARM G610 GPU, 12GB ర్యామ్ తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

Tecno Pova curve 2 smartphone

భారీ బ్యాటరీ! :
ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా 7750mAh బ్యాటరీ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు 1080 x 2364 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 420 ppi ను కలిగి ఉండే అవకాశం ఉంది.

బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి! :
టెక్నో పోవా కర్వ్‌ 2 స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో రూ.16000 నుంచి రూ.17000 ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

* టెక్నో నుంచి ఈ సంవత్సరం జనవరిలో స్పార్క్‌ గో 3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.8999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డ్రాప్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 1.2 మీటర్ల నుంచి కింద పడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుందని చెబుతోంది.

ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌ Unisoc T7250 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 13MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలున్నాయి. డ్యూయల్‌ LED ఫ్లాష్‌ కూడా ఉంది. 15W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. Ella AI సపోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Pova curve 2 smartphone confirmed to launch on February 13 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X