Home
Mobile

కర్వడ్‌ ఎడ్జ్‌ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్‌.. మీడియాటెక్‌ చిప్‌సెట్‌, భారీ బ్యాటరీ సహా..!

భారత్‌ మార్కెట్‌లో జనవరి నెలలో టెక్నో నుంచి స్పార్క్‌ గో 3 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. రూ.8999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, డ్రాప్‌ రెసిస్టెన్స్‌, IP64 రేటింగ్‌ సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే త్వరలో టెక్నో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

గత సంవత్సరం టెక్నో పోవా కర్వ్‌ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. త్వరలో ఈ హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌ విడుదల కానుంది. టెక్నో పోవా కర్వ్‌ 2 స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Curve 2 Smartphone) లాంచ్ కానుంది. ఈ వివరాలను టెక్నో వెల్లడించింది. X హ్యాండిల్‌ ద్వారా ఈ ఫోన్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

Tecno Pova Curve 2

కర్వడ్‌ ఎడ్జ్‌ :
ఈ వివరాల ఆధారంగా టెక్నో పోవా కర్వ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ ఎడ్జ్‌లను కలిగి ఉంది. అయితే టెక్నో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏ తేదీన విడుదల కానుందనే వివరాలను వెల్లడించలేదు. దీంతోపాటు స్పెసిఫికేషన్‌లను వివరాలనూ షేర్‌ చేయలేదు. టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
టెక్నో పోవా కర్వ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల గూగుల్ ప్లే కన్సోల్‌ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ మీడియాటెక్ MT6858 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు ARM Mali G610 ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని సమాచారం. 12GB ర్యామ్‌తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 7750mAh లిథియం అయాన్‌ పాలిమర్‌ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలపై టెక్నో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

టెక్నో స్పార్స్‌ గో 3 స్మార్ట్‌ఫోన్ :
టెక్నో స్పార్స్‌ గో 3 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డ్రాప్‌ రెసిస్టెంట్‌గా ఉంది. Unisoc T7250 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ 15W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Ella AI ఫీచర్‌ కూడా ఉంటుంది. దీంతోపాటు మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం ప్రత్యేక ఫీచర్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Pova Curve 2 smartphone teased expected to launch soon in india specifications details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X