Home
Mobile

64MP కెమెరా, కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, AI ఫీచర్‌లతో 5G స్మార్ట్‌ఫోన్‌... పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో నుంచి కీలక ప్రకటన వెలువడింది. కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, మెరుగైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను మే 29 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్‌ గురించి అనేక వివరాలను వెల్లడించింది. మెరుగైన సిగ్నల్‌ కోసం ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉందని తెలిపింది.

టెక్నో టీజర్‌ల ఆధారంగా పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Tecno Pova Curve 5G) స్లీక్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు కెమెరా బంప్‌ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఇటీవలే గూగుల్‌ ప్లే కన్సోల్‌ కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 1080 x 2436 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Tecno pova curve 5G smartphone launch date in india

మీడియాటెక్ చిప్‌సెట్ :
టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ MT6978 SoC (మీడియాటెక్‌ డైమెన్సిటి 7300 SoC) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. అయితే ఫోన్‌ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

64MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ టెక్నో ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెకండరీ కెమెరాతోపాటు సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన కనెక్టివిటీ, సిగ్నల్‌ కోసం అనేక అడ్వాన్సడ్‌ నెట్‌వర్క్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో 5G++, VoWiFi డ్యూయల్‌ పాస్‌, ఇంటెలిజెంట్‌ సిగ్నల్ హబ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

Tecno pova curve 5G smartphone launch date in india

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు :
టెక్నో స్మార్ట్‌ఫోన్ Ella AI తో ఇంటిగ్రేట్‌ చేసి ఉంటుంది. ఫలితంగా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను అందిస్తుంది. ఇందులో AI కాల్ అసిస్టెంట్‌, AI ఆటో ఆన్సర్‌, AI వాయిస్‌ ప్రింట్‌ నాయిస్‌ వంటి అనేక AI ఫీచర్‌లు ఉండనున్నాయి.

టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ :
భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. దీంతోపాటు Mail G57 MC2 GPU చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HiOS 14.5 OS ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 108MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు LED ఫ్లా్ష్‌ లైట్‌ను అమర్చారు. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno pova curve 5G smartphone 64MP camera and AI features launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X