Home
Mobile

రూ.15,999 ధరకు 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

Tecno Pova Curve 5G Smartphone : టెక్నో నుంచి ఇవాళ మిడ్‌ రేంజ్‌ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. టెక్నో పోవా కర్వ్ 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల అయింది. మరియు అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5500mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. మరియు 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 7.45mm థిక్‌నెస్‌తో స్లిమ్‌ కర్వడ్‌ హ్యాండ్‌సెట్‌గా విడుదల అయింది. ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్‌ HD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 93.8 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంటుంది.

Tecno Pova Curve 5G Smartphone launched

ఈ ఫోన్‌ డిస్‌ప్లే వెట్‌ హ్యాండ్‌ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. మేజిక్‌ సిల్వర్‌, గీక్‌ బ్లాక్‌, నియాన్‌ సియాన్ రంగుల్లో లభిస్తుంది. మొత్తంగా డిజైన్‌ పరంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్‌గా అదనంగా 8GB వరకు ర్యామ్‌ను పొడిగించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. 6GB/128GB, 8GB/128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

AI ఫీచర్‌లు :
ఈ టెక్నో ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. వాయిస్‌ ప్రింట్‌, ఆటో కాల్‌ ఆన్సరింగ్‌, లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. వాయిస్ ప్రింట్‌ ఫీచర్‌ ద్వారా కాలింగ్ సమయంలో వాయిస్‌ క్లియర్‌ గా ఉండేలా చూస్తుంది. దీంతోపాటు డాల్బీ అట్మాస్‌, డ్యూయల్‌ మైక్రోఫోన్స్‌ వంటి ఫీచర్లున్నాయి.

Take a Poll

64MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ రెండు కెమెరాల ద్వారా 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.

Tecno Pova Curve 5G Smartphone launched

45 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్‌ :
ఈ టెక్నో హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 45 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ చేయవచ్చని టెక్నో చెబుతోంది. ఈ ఫోన్ బైపాస్‌ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్‌ వంటి సమయాల్లో ఫోన్‌ వేడెక్కకుండా ఉంటుందని చెబుతోంది.

ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. 5G++, VoWiFi డ్యూయల్‌ పాస్‌, ఇంటెలిజెంట్‌ సిగ్నల్‌ హబ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్‌లున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలు సహా సిగ్నల్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మెరుగైన పనితీరును అందిస్తుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, IR బ్లాస్టర్‌, NFC వంటి ఫీచర్‌లున్నాయి.

Tecno Pova Curve 5G Smartphone launched

టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది.

జూన్‌ 5 వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ముందస్తు బుకింగ్‌పై స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌, వారంటీలను పొందవచ్చు. దీంతోపాటు 10 నెలల వరకు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Pova Curve 5G Smartphone launched with 64MP Camera and 5500mAh Battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X