రూ.15 వేల ధరలో కర్వడ్ డిస్‌ప్లే, 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో భారత్ మార్కెట్‌లో ఎంట్రీ, బడ్జెట్ ధర సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇటీవలే 3D కర్వడ్ డిస్‌ప్లే కలిగిన ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మా్ర్ట్‌ఫోన్ టెక్నో పోవా స్లిమ్ 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇటీవలే సేల్ కూడా ప్రారంభం అయింది. అయితే ఈ సంవత్సరం మే నెలలో టెక్నో నుంచి కర్వడ్ డిస్‌ప్లేతో టెక్నో పోవా కర్వ్ 5G విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు.
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Curve 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999, 8GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు, SBI ఫ్లిప్‌కార్ట్ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ 7.45mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ టెక్నో హ్యాండ్‌సెట్ సైబర్ ఆరెంజ్, గీక్ బ్లాక్, మేజిక్ సిల్వర్, నియాన్ సియాన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తున్నాయి.
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వర్చువర్ ర్యామ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది.
5500mAh బ్యాటరీ :
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్ ఒక సంవత్సరం ఆండ్రాయిడ్ OS ను పొందుతుంది. దీంతోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 0-100 శాతం ఛార్జింగ్‌ను 45 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని టెక్నో చెబుతోంది.
64MP కెమెరా :
టెక్నో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ Auto Call Answer, వాయిస్ ప్రింట్, Live Translation వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన సిగ్నల్‌ను పొందడానికి వీలుగా 5G++, Vo Wi-Fi, ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్పీకర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు NFC, IR బ్లాస్టర్ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








