Home
Mobile

రూ.15 వేల ధరకు 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ టెక్నో పోవా కర్వ్‌ 5G ను ఇటీవల విడుదల చేసింది. రూ.20 వేల ధరలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ సంవత్సరం భారత్‌ మార్కెట్‌ లో అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. ఇందులో ఎంట్రీ, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం జూన్‌ నెలలో అందుబాటులోకి వచ్చిన టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

డిస్కౌంట్ ధరకు పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ :
టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Curve 5G Smartphone) జూన్‌ లో తొలి సేల్‌ ప్రారంభం అయింది. గతంలో ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉండేది. ప్రస్తుతం రూ.15499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

tecno pova curve 5G smartphone

నాలుగు కలర్‌ వేరియంట్స్ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ సైబర్‌ ఆరెంజ్‌, నియాన్‌ సియాన్, మేజిక్‌ సిల్వర్‌, గీక్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.45mm థిక్‌నెస్‌ తో అందుబాటులో ఉంది.

6.78 అంగుళాల భారీ డిస్‌ప్లే :
టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. డిస్‌ప్లే వెట్‌ హ్యాండ్ టచ్ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ ను ఉపయోగించుకోవచ్చు.

tecno pova curve 5G smartphone

2 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
టెక్నో స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఒక ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

64MP కెమెరా :
ఈ ఫోన్ 64MP సోనీ IMX682 కెమెరా, 2MP కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 4K వీడియో రికార్డు చేయవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 45 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్ చేయవచ్చని టెక్నో చెబుతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ Live Translation, Voice Print, Auto Call Answering వంటి ఫీచర్లతోపాటు మెరుగైన సిగ్నల్‌ కోసం ఇంటెలిజెంట్‌ సిగ్నల్‌ హబ్‌ సిస్టమ్‌, 5G++, Vo Wi-Fi ఫీచర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్పీకర్‌లు, భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. IR బ్లాస్టర్‌, NFC వంటి ఫీచర్లున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
tecno pova curve 5G smartphone now available with discount price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X