Home
Mobile

రూ.14999 ధరకు 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌..!

టెక్నో ఈ సంవత్సరం భారత్‌ మార్కెట్‌ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇటీవలే సన్నని డిజైన్‌తో టెక్నో పోవా కర్వడ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను కూడా విడుదల చేసింది. ఈ సంవత్సరం జూన్‌ లో విడుదల చేసిన టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

భారత్‌ లో విడుదల సమయంలో టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Curve 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉండేది. ప్రస్తుతం 6GB ర్యామ్ వేరియంట్‌ రూ.1000 డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

Tecno Pova Curve 5G

రూ.14999 ప్రారంభ ధరతో :
డిస్కౌంట్ ఆఫర్‌తో రూ.14,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ సన్నని డిజైన్‌తోపాటు సైబర్‌ ఆరెంజ్‌, గీక్‌ బ్లాక్‌, మేజిక్‌ సిల్వర్‌, నియాన్ సియాన్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

టెక్నో ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే వెట్‌ హ్యాండ్ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతో తడి చేతులతోనూ ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

రెండు సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS అప్‌డేట్‌తోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఇందులో 64MP సోనీ IMX682 కెమెరా, 2MP కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 4K వీడియో రికార్డు సామర్థ్యాన్ని కలిగి ఉంది.

5500mAh బ్యాటరీతో :
పోవా కర్వ్‌ 5G ఫోన్ Auto Call Answering, Live Translation, Voice Print వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ ఇంటెలిజెంట్‌ సిగ్నల్‌ హబ్‌ సిస్టమ్‌, 5G++, Vo Wi-Fi వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మెరుగైన సిగ్నల్‌ వచ్చేలా ఈ ఫీచర్‌లు పనిచేస్తాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్‌తో స్పీకర్‌ను కలిగి ఉంది. NFC, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tecno Pova Curve 5G smartphone now under Rs15000 price in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X