64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 3D కర్వడ్ డిస్‌ప్లేతో 5G ఫోన్.. రూ.15999 తో ఇవాళ్టి నుంచే సేల్!
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. 64MP కెమెరా. 5500mAh బ్యాటరీ వంటి అనేక మెరుగైన కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.
భారత్ మార్కెట్‌లో టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Curve 5G Smartphone Sale) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మేజిక్ సిల్వర్, గీక్ బ్లాక్, నియాన్ సియాన్ వంటి మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్‌లో వర్చువల్‌గా ర్యా్మ్‌ను పొడిగించుకొనే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది.
2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్ అందిస్తుంది. దీంతోపాటు 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని టెక్నో తెలిపింది. వాయిస్ ప్రింట్, లైవ్ ట్రాన్స్‌లేషన్, ఆటో కాల్ ఆన్సరింగ్ వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. మరియు 7.45mm థిక్‌నెస్‌తో స్లి్‌మ్ కర్వడ్ డిజైన్‌ను కలిగి ఉంది. 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 93.8 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ను నియంత్రించవచ్చు.
64MP కెమెరా :
ఈ హాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 64MP సోనీ IMX682 కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఛార్జర్ ద్వారా కేవలం 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చని టెక్నో చెబుతోంది. ఈ టెక్నో హ్యాండ్‌సెట్ మరో బెస్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
ఈ టెక్నో పోవా కర్వ్ 5G ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్పీకర్‌లు, IR బ్లాస్టర్, NFC వంటి ఫీచర్‌లున్నాయి. దీంతోపాటు మెరుగైన సిగ్నల్ కోసం 5G++, Vo WiFi, ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లున్నాయి.


Click it and Unblock the Notifications