Home
Mobile

కర్వడ్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ కెమెరా, స్లిమ్‌ డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌.. టీజర్‌ విడుదల, ఫీచర్‌ల వివరాలు..!

భారత్‌ మార్కెట్‌లో టెక్నా మొబైల్స్‌ సంస్థ ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. టెక్నో పోవా సిరీస్‌లో అనేక ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే టెక్నో నుంచి త్వరలో మరో ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివరాలతోపాటు డిజైన్‌ కూడా విడుదల అయింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ అయింది.

టెక్నో మొబైల్స్ నుంచి త్వరలో భారత్ మార్కెట్‌లోకి టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Curve 5G Smartphone) విడుదల కానుంది. తాజాగా లాంచ్‌ అయిన టీజర్‌ ఆధారంగా డిజైన్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. పేరుకు తగ్గట్టుగానే కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్లిమ్‌ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.

Tecno pova Curve 5G Smartphone teased in india

టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరా బంప్‌ను గుర్తించవచ్చు. దీని ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే కెమెరా స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాలేదు. గతంలో వచ్చిన వివరాల ఆధారంగా LED లైట్‌ను కూడా కలిగి ఉంటుంది.

టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్చోరేజీ, 8GB ర్యా్మ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ కానుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ టెక్నో పోవా కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ నెలలోనే భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ చిప్‌సెట్, డిస్‌ప్లే సహా ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో ఈ ఫోన్ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నో పోవా 6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో ధర రూ.13999 గా ఉంది. మరో వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. తో లాంచ్‌ అయింది.

ఈ టెక్నో ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. దీంతోపాటు Mail G57 MC2 GPU చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. మీడియాటెక్ చిప్‌సెట్‌ గరిష్ఠంగా LPDDR4X ర్యామ్‌, UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HiOS 14.5 OS ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు LED ఫ్లా్ష్‌ లైట్‌ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ అనేక AI ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno pova Curve 5G Smartphone teased in india curve display and triple camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X