రూ.15999 ధరకు 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 3D కర్వడ్ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్!
Tecno Pova Curve 5G Smartphone : టెక్నో నుంచి గత సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. సన్నని డిజైన్‌తో స్లిమ్ మోడల్‌ను కూడా కొన్ని నెలల ముందు అందుబాటులోకి తీసుకొచ్చింది. గత సంవత్సరం విడుదల అయిన టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు :
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ టెక్నో ఫోన్ 7.45mm థిక్‌నెస్‌తో స్లి్‌మ్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గీక్ బ్లాక్, మేజిక్ సిల్వర్, నియాన్ సియాన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
3D కర్వడ్ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.
మీడియాటెక్ చిప్, ఆండ్రాయిడ్ 15 OS :
టెక్నో పోవా కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. అంటే అదనంగా ర్యామ్‌ను పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్, 13MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. ఈ ఫోన్ ఆటో కాల్ ఆన్సరింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్, వాయిస్ ప్రింట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
బ్యాటరీ, ఛార్జంగ్ పరంగా ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్‌తో కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చని టెక్నో తెలిపింది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై తోపాటు మెరుగైన కనెక్టివిటీ కోసం 5G++, VoWiFi, ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. NFC, IR బ్లాస్టర్, డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్పీకర్‌లు, భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.


Click it and Unblock the Notifications








