Home
Mobile

ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రకటన చేసిన ప్రముఖ సంస్థ..!

Tecno Slimmest Smartphone : భారత్‌ మార్కెట్‌ లో ప్రీమియం మోడల్‌తోపాటు మిడ్‌ లెవల్‌, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా స్లిమ్‌, అల్ట్రా స్లిమ్‌ డిజైన్‌ తో అందుబాటులోకి వస్తున్నాయి. భారీ బ్యాటరీలు కలిగి ఉన్న మోడల్స్‌ కూడా స్లిమ్ డిజైన్‌ ను కలిగి ఉంటున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ప్రపంచంలోనే స్లిమ్‌ 5G కర్వడ్ ఫోన్‌ ను తీసుకురానున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలను కూడా వెల్లడించింది.

వరల్డ్‌ స్లిమ్ ఫోన్ ఎప్పుడు లాంచ్‌ కానుంది? :
టెక్నో ఈ స్లిమ్‌ కర్వడ్‌ 5G ఫోన్‌ను సెప్టెంబర్‌ లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ధర సుమారుగా రూ.80 వేలుగా ఉంటుందని చెబుతోంది. అయితే ఈ ఫోన్‌ కు సంబంచిన ఎటువంటి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల వివరాలను టెక్నో వెల్లడించలేదు.

tecno to launch worlds slimmest 5G smartphone

ఈ సంవత్సరం నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2025 లో :
అయితే ఈ సంవత్సరం జరిగిన మొబైల్‌ వరల్డ్ కాంగ్రెస్ 2025 (MWC) టెక్నో స్పార్క్‌ స్లిమ్ మోడల్‌ ను ప్రదర్శించింది. ఈ డిజైన్‌ ను పోలి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డిజైన్‌ అందరికీ ఆకట్టుకుంది. కేవలం 5.75mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది.

గెలాక్సీ S25 ఎడ్జ్‌ మోడల్‌ కంటే సన్నంగా :
ఇటీవల అందుబాటులోకి వచ్చిన శాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్‌ మోడల్‌ కంటే టెక్నో మోడల్ మరింత సన్నని డిజైన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఏ పేరుతో లాంచ్‌ కానుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G మోడల్‌ గా నిలుస్తుందని చెబుతున్నారు.

రూ.80 వేల ధర రేంజ్‌లో :
స్పెసిఫికేషన్లు వివరాలను వెల్లడించకపోయినా ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌ లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. హైఎండ్‌ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.80 వేలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న అంచనా వివరాల ఆధారంగా 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుందని భావిస్తున్నారు. క్వాడ్‌ కర్వడ్‌ స్క్రీన్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌ డిస్‌ప్లే 6.3 అంగుళాల నుంచి 6.5 అంగుళాల వరకు ఉంటుంది.

కాన్సెప్ట్‌ మోడల్‌ స్పెసిఫికేషన్లు :
మొబైల్ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2025 లో టెక్నో ఆవిష్కరించిన కాన్సెప్ట్‌ మోడల్‌ కేవలం 5.75mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో 6.78 అంగుళాల కర్వడ్‌ ఎడ్జ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ టెక్నో ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. టెక్నో కొత్త ఫోన్ వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
tecno set to launch slimmest 5G smartphone in the world in india soon full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X