ధర రూ.13999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ 5G స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, సేల్ వివరాలు.!
టెక్నో నుంచి ఇవాళ టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Spark 20 Pro 5G Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.15999 గా ఉంది. అయితే ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ధర సెగ్మెంట్‌లోనే మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. డిజైన్ కూడా ఆకట్టుకొనేలా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. జులై 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPS పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో లాంచ్ అయింది. 33W ఫ్లాష్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HiOS 14 పైన పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ అండర్ ది హుడ్ 6nm D6080 5G ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్ + 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 108MP ప్రధాన కెమెరా సహా 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరా డ్యూయల్ కలర్ టెంపరేచర్ ఫ్లాస్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ కెమెరాలు 30fps తో 2K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఫిల్మ్ మోడ్, AI క్యామ్, పొర్ట్రెయిట్, సూపర్ నైట్, స్లో మోషన్, టైం ల్యాప్స్, డ్యూయల్ వీడియో, షార్ట్ వీడియో, పరోరమ, సూపర్ మ్యాక్రో, డాక్యుమెంట్, AR షార్డ్ ఫీచర్‌లను కలిగి ఉంటాయి.
టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను జులై 11 నుంచి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీతో రూ.15,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది.
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు, UPI ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.13,999 గా ఉంటుంది. స్టార్ట్‌రెయిల్ బ్లాక్, గ్లోసీ వైట్ రంగుల్లో లభిస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








