అదిరిపోయే డిజైన్, 108MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్ టీజర్ విడుదల.. పూర్తి వివరాలు..!!
భారత్ మార్కెట్‌లో జులై నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ టెక్నో నుంచి స్పార్క్ 20 ప్రో 5G హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్ అమెజాన్‌లో లాంచ్ అయింది. దీని ఆధారంగా త్వరలో టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Spark 20 Pro 5G Smartphone) భారత్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన స్పెసిఫికేషన్‌లతో విడుదల కానుందని తెలుస్తోంది.
ఈ టెక్నో స్పార్క్ 20 ప్రో 5G హ్యాండ్‌సెట్ గత నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్ మార్కెట్‌లోకి ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే జులై నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అమెజాన్ పేజీ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

గ్లోబల్ వేరియంట్ మరియు కొన్ని వివరాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ లామీ కర్వడ్ కెమెరా డిజైన్‌లో 108MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 6.78 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
టెక్నో స్పార్క్ 20 ప్రో 5G అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 2460*1080 పిక్సల్ రిజల్యూషన్ తో 6.78 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలుస్తోంది. 120Hz రీప్రెష్ రేట్, గరిష్ఠంగా 580 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుంది. NEG గ్లాస్ భద్రతను కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14 పైన పనిచేస్తుంది. కెమెరాల పరంగా 108MP ప్రధాన కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ టెక్నో కొత్త హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కొన్ని నివేదికల ప్రకారం టెక్నో స్పార్క్ 20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 16GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. అంటే 8GB ఫిజికల్ ర్యామ్ సహా 8GB వర్చువల్ ర్యామ్‌ను పొందుతుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 128GB మరియు 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ IP53 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గ్లాసీ వైట్, నియాన్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో వంటి మూడు రంగుల్లో అందుబాటలో ఉంటుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








