ధర రూ.7999కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఆపిల్ తరహా ఫీచర్..!
టెక్నో స్పార్క్ 20C స్మార్ట్‌ఫోన్‌ను (Tecno Spark 20C Smartphone) భారత్‌లో ఆవిష్కరించారు. ఈ హ్యాండ్‌సెట్‌ను గత సంవత్సరం నవంబర్‌లోనే కొన్ని దేశాల్లో పరిచయం చేశారు. ఈ ఫోన్ డైనమిక్ పోర్ట్ ఫీచర్ మరియు వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను మరికొన్ని రోజుల్లో భారత్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
టెక్నో స్పార్క్ 20C స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
టెక్నో స్పార్క్ 20C స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు డైనమిక్ పోర్టుతో వచ్చింది. ఈ తరహా డైనమిక్ ఐలాండ్ డిజైన్‌ను ఐఫోన్లు కలిగి ఉంటాయి.

ఈ టెక్నో స్పార్క్ 20C స్మార్ట్‌ఫోన్ Darwin ఇంజిన్‌ను కలిగి ఉంటుందని, ఇది మెరుగైన గేమింగ్ అనుభూతిని ఇస్తుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G36 SoC చిప్ 8GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. మరియు వర్చువల్‌గా 8GB అదనపు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. మరియు ఈ ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
టెక్నో స్పార్క్ 20C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13 పైన పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా 1080P టైమ్ ల్యాప్స్ వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు AI ఆధారిత మరో కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉండనుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.

కొత్త టెక్నో హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ ఛార్జర్ ద్వారా 50 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. మరియు భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్‌లాక్ సదుపాయాన్ని కలిగి ఉంది.
రూ.1000 తగ్గింపు : టెక్నో స్పార్క్ 20C స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ను రూ.8,999కు కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ కింద సంస్థ రూ.1000 తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.7,999 కే సొంతం చేసుకోవచ్చు.
సేల్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే? : భారత్‌లో మార్చి 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ (Tecno Spark 20C sale Date) ప్రారంభం కానుంది. ఈ టెక్నో స్పార్క్ 20C స్మార్ట్‌ఫోన్ అల్పెన్‌గ్లో గోల్డ్, గ్రావిటీ బ్లాక్, మైస్టరీ వైట్, మేజిక్ స్కిన్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








