Home
Mobile

రోజుకు రూ.44 చెల్లించి 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.. 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!

భారత్‌ మార్కెట్‌ లో గత సంవత్సరం అక్టోబర్‌ లో టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్ (Tecno Spark 30C 5G Smartphone) లాంచ్‌ అయింది. బడ్జెట్ రేంజ్‌ లో మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ లను కలిగి ఉంది. గతంలో రెండు వేరియంట్‌ లో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్‌ తాజాగా సేల్‌ ప్రారంభం అయింది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, సేల్‌, ఫీచర్‌ల వివరాల పూర్తి వివరాలు.

కొత్త వేరియంట్ ధర వివరాలు :
టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.9999, రూ.10499 గా ఉన్నాయి. తాజాగా 8GB ర్యామ్ వేరియంట్‌ విడుదల అయింది. ధర రూ.12,999 గా ఉంది.

tecno spark 30c 5g smartphone

రోజుకు రూ.44 చెల్లించి ఫోన్ కొనుగోలు చేయవచ్చు :
ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్‌ షాడో, అజుర్‌ స్కై, అరోరా క్లౌడ్ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది. EMI ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. రోజుకు రూ.44 చొప్పున చెల్లించి ఈ ఫోన్‌ ను కొనుగోలు చేయవచ్చు. ఇలా 10 నెలలపాటు EMI చెల్లించాల్సి ఉంటుంది.

టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ (Tecno Spark 30C 5G Specs) 6.67 అంగుళాల HD (720*1600 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HiOS 14 ను కలిగి ఉంది.

tecno spark 30c 5g smartphone

1TB వరకు స్టోరేజీ! :
ఈ స్పార్క్‌ 30C హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. వర్చువల్‌గా 8GB ర్యామ్‌ ను అదనంగా పొడిగించవచ్చు. అదే విధంగా మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

48MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
టెక్నో ఫోన్‌ వెనుక వైపు 48MP సోనీ IMX582 కెమెరా సహా LED ఫ్లాష్‌ లైట్‌ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W వైర్‌ ఛార్జింగ్‌ తో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కనెక్టివిటీ ఫీచర్‌లు :
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G, 4G LTE, WiFi, బ్లూటూత్‌, NFC, IR రిమోట్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
tecno spark 30c 5g smartphone 8GB ram variant is on sale on flipkart in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X