Home
Mobile

ధర రూ.9,999 కే 48MP కెమెరా, 6.67 అంగుళాల HD డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ వివరాలు!

టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 48MP కెమెరా, గరిష్ఠంగా 128GB స్టోరేజీ వేరియంట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ను వర్చువల్‌గా పొడిగించుకొనే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.10000 కంటే తక్కువగా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్లు :
టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ (Spark 30C 5G Smartphone Launched) 120Hz రీప్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD (720*1600 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

Tecno Spark 30C 5G Smartphone launched in india

1TB వరకు స్టోరేజీ.. :
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది. దీంతోపాటు వర్చువల్‌గా 4GB ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

48MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 48MP సోనీ IMX582 కెమెరాను కలిగి ఉంది. మరియు వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చారు. ముందువైపు ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ, కెమెరాల కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HiOS 14 ను కలిగి ఉంటుంది.

Tecno Spark 30C 5G Smartphone launched in india

ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W వైర్‌ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

టెక్నో స్పార్క్‌ 30C 5G ధర, సేల్‌ వివరాలు :
టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ (Spark 30C 5G Smartphone Sale) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అరోరా క్లౌడ్‌, అజుర్‌ స్కై, మిడ్‌నైట్‌ షాడో రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Tecno Spark 30C 5G Smartphone launched in india

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X