Home
Mobile

48MP కెమెరా, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. పూర్తి వివరాలు..!

టెక్నో నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. టెక్నో స్పార్క్‌ 30C 5G (Tecno Spark 30C 5G Smartphone) పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ విడుదల అయింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 48MP సోనీ కెమెరా, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక దేశాల్లో అందుబాటులో ఉంది. ఆ దేశాల్లో ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

టెక్నో స్పార్క్‌ 30C 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో అక్టోబర్‌ 8వ తేదీన విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయి. మరియు 48MP సోనీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ముందువైపు పంచ్‌ హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన డిస్‌ప్లేతో విడుదల కానుంది.

Tecno Spark 30C 5G smartphone

టెక్నో గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ టెక్నో స్పార్క్‌ 30C స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా టెక్నో స్పార్క్‌ 30, టెక్నో స్పార్క్ 30 ప్రో హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

మరియు ఈ టెక్నో స్పార్క్‌ 30C గ్లోబల్‌ వేరియంట్‌ మీడియాటెక్‌ హీలియో G81 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు 4GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 4GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

ఈ గ్లోబల్‌ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. అదే ముందువైపు డ్యూయల్‌ ఫ్లాష్‌తో కూడిన 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ సిరీస్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో ఆర్బిట్‌ బ్లాక్‌, ఆర్బిట్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అయితే భారత్‌ వేరియంట్‌ ఇదే తరహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందా లేదా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అక్టోబర్‌ 8 పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Spark 30C 5G smartphone set to launch on october 8th in india specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X