Home
Mobile

Tecno Spark 8T బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

చైనా యొక్క ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని టెక్నో బ్రాండ్ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ టెక్నో స్పార్క్ 8T సరసమైన ధర వద్ద నేడు భారతదేశంలో గ్రాండ్ గా లాంచ్ చేయబడింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశంలో లాంచ్ అయిన వనిల్లా టెక్నో స్పార్క్ 8 కి అప్‌గ్రేడ్‌ వెర్షన్ తో వస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా చూసుకుంటే కనుక ఈ కొత్త హ్యాండ్‌సెట్ హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G35 చిప్‌సెట్, 5,000mAh బ్యాటరీ మరియు 50-మెగాపిక్సెల్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త Tecno ఫోన్ నాలుగు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Tecno Spark 8T ధర మరియు లభ్యత వివరాలు

Tecno Spark 8T ధర మరియు లభ్యత వివరాలు

భారతదేశంలో టెక్నో స్పార్క్ 8T స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ధరలో లభిస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్లో లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.8,999. ఈ ఫోన్ అట్లాంటిక్ బ్లూ, కోకో గోల్డ్, ఐరిస్ పర్పుల్ మరియు టర్కోయిస్ సియాన్ వంటి నాలుగు కలర్ ఎంపికలతో లభిస్తుంది. ఇది నేటి నుంచి అంటే డిసెంబర్ 15 నుండి అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించబడుతుంది. ఈ బ్రాండ్ యొక్క ముందు తరం ఫోన్ Tecno Spark 8 ఫోన్ యొక్క 2GB + 64GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో సెప్టెంబర్‌లో రూ.7,999 ధర వద్ద లాంచ్ అయింది.

Tecno Spark 8T స్పెసిఫికేషన్స్

Tecno Spark 8T స్పెసిఫికేషన్స్

టెక్నో స్పార్క్ 8T స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై HiOS v7.6తో రన్ అవుతుంది. అలాగే ఇది 91.3 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో మరియు ఒక గరిష్ట ప్రకాశం 500 నిట్స్ తో కూడిన 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek Helio A35 SoC ద్వారా శక్తిని పొందుతుంది. Tecno Spart 8Tలో ప్రత్యేక స్లాట్ ద్వారా మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు.

ఆప్టిక్స్

Tecno Spark 8T స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/1.6 లెన్స్ మరియు AI లెన్స్‌తో పాటు క్వాడ్ LED ఫ్లాష్ ఉన్నాయి. వెనుక కెమెరా AI బ్యూటీ, AR అనిమోజీ మరియు స్టిక్కర్లు, గూగుల్ లెన్స్, టైమ్-లాప్స్, స్లో మోషన్, స్మార్ట్ పోర్ట్రెయిట్ మరియు వీడియో బోకె వంటి విభిన్న ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇతర కెమెరా ఫీచర్లలో 1080p టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ మరియు 120fps స్లో మోషన్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం డ్యూయల్ ఫ్లాష్ సపోర్ట్‌తో ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

Tecno Spark 8T స్మార్ట్‌ఫోన్‌ లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, మైక్రో-USB, FM రేడియో మరియు USB OTG ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, g-సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అదనంగా స్పార్క్ 8T DTS సౌండ్ SOPLAY 2.0ని ప్యాక్ చేస్తుంది. అలాగే ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఆప్టిమైజ్ చేయబడిన పవర్-పొదుపు మోడ్‌లతో వస్తుంది. బ్యాటరీ గరిష్టంగా 38 రోజుల స్టాండ్‌బై సమయాన్ని మరియు 122 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇది గరిష్టంగా 40 గంటల కాలింగ్ సమయాన్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 164.25x75.87x8.85mm కొలతల పరిమాణంలో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Spark 8T Budget Smartphone Released in India With Dual Rear Cameras: Price, Specs, Sale Date, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X