భార‌త మార్కెట్లో Tecno Spark 9 మోడ‌ల్ మొబైల్‌ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

|

ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Tecno.. భార‌త మార్కెట్‌కు స‌రికొత్త మోడ‌ల్ మొబైల్‌ను ప‌రిచ‌యం చేసింది. Tecno Spark 9 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను సోమ‌వారం భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. MediaTek G37 SoC ప్రాసెస‌ర్‌తో వస్తున్న ఈ మొబైల్ అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఇది 6.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. అంతేకాకుండా 5,000mAh అప్‌గ్రేడెడ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో వ‌చ్చింది. ఇప్పుడు మ‌నం ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు, భార‌త్‌లో ఈ మొబైల్ ధ‌ర‌ల‌ వివ‌రాల‌ను తెలుసుకుందాం.

 
భార‌త మార్కెట్లో Tecno Spark 9 మోడ‌ల్ మొబైల్‌ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

Tecno Spark 9 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ MediaTek G37 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 6GB RAM కెపాసిటీ (5GB expandable virtual RAM)తో, మెరుగైన ప‌ని తీరును క‌న‌బ‌రుస్తుంది. దీనికి 6GB RAM(5GB expandable virtual RAM)| 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు.

ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా వ‌ద్ద‌ వాట‌ర్ డ్రాప్ స్టైల్ నాచ్ అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ వ‌ర్శ‌న్ 4.2 క‌లిగి ఉంది.

భార‌త మార్కెట్లో Tecno Spark 9 మోడ‌ల్ మొబైల్‌ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

భార‌త మార్కెట్లో దీని ధ‌ర‌:
భార‌త్‌లో మార్కెట్లో ఈ మొబైల్ ధ‌ర రూ.9,499 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు భార‌త మార్కెట్‌లో వినియోగ‌దారుల‌కు ఇన్‌ఫినిటీ బ్లాక్‌, స్కై మిర్ర‌ర్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయి. ఈ Tecno Spark 9 మొబైల్స్ కు సంబంధించి జులై 23 వ తేదీ నుంచి అమెజాన్‌లో వేదిక‌గా సేల్స్ ప్రారంభం కానున్నాయి.

భార‌త మార్కెట్లో Tecno Spark 9 మోడ‌ల్ మొబైల్‌ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

భార‌త్‌లో ఇప్ప‌టికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న Tecno Pova 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.9 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ MediaTek MT6877 Dimensity 900 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 8GB RAM కెపాసిటీతో, మెరుగైన ప‌ని తీరును క‌న‌బ‌రుస్తుంది. దీనికి 8GB RAM|128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు.

ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మ‌రో కెమెరా లెన్స్ అందిస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 6,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18 వాట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ Wi-Fi Direct, hotspot, బ్లూటూత్ క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం ఈ మొబైల్ అమెజాన్‌లో 31శాతం ఆఫ‌ర్‌తో రూ.19,999 కి అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Tecno Spark 9 With MediaTek Helio G37 SoC Launched in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X