Home
Mobile

రూ.10వేల లోపు SmartPhone కోసం చూస్తున్నారా.. అయితే ఇది బెస్ట్ ఎంపిక‌!

Tecno కంపెనీ భార‌త మార్కెట్‌కు కొత్త మోడ‌ల్‌ను SmartPhone ను ప‌రిచ‌యం చేసింది. Tecno Spark 9T బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్లో గురువారం విడుద‌ల చేసింది. ఇదే మోడ‌ల్‌కు సంబంధించి గ్లోబ‌ల్‌గా విడుద‌లైన వేరియంట్‌తో పోలిస్తే... భార‌త వేరియంట్‌కు కొంత తేడాలతో రూపొందిచారు. ఈ కంపెనీ నుంచి Tecno Spark 9 స‌రీస్‌లో ఇది రెండో మోడ‌ల్ కావ‌డం విశేషం. గ‌తంలో విడుద‌ల చేసిన Tecno Spark 9 కు కొన‌సాగింపుగా ఈ Tecno Spark 9T ని త‌యారు చేశారు.

Tecno Spark 9T Launched

భార‌త్‌లో ఈ Tecno Spark 9T ధ‌ర‌లు:
భార‌త్ మార్కెట్లో ఈ Tecno Spark 9T ని బ‌డ్జెట్ ధ‌ర‌లోనే విడుద‌ల చేశారు. రూ.10 వేల లోపు దీని ధ‌ర‌ను నిర్ణ‌యించారు. కేవ‌లం రూ.9,299 కే ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ కొనుగోలు దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఇది అట్లాంటిక్ బ్లూ, టాహితి గోల్డ్‌, ఐరిస్ ప‌ర్పుల్ క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌కు సంబంధించి ఫ‌స్ట్ సేల్ ఆగ‌స్టు 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ వేదిక‌గా దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tecno Spark 9T ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD (1,080x2,408 pixels) రిసొల్యూష‌న్‌తో డిస్‌ప్లే ను అందిస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లే కు వాట‌ర్ డ్రాప్ నాచ్ తో ఇస్తున్నారు. ప‌వ‌ర్ బ‌ట‌న్ లో పొందుప‌రిచిన సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 60Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత HiOS 7.6, ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio H35 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 4GB RAM| 64GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రొక‌టి 2 మెగాపిక్సెల్ క్వాలిటీలో పోర్ట్ర‌యిట్ లెన్స్‌, ఏఐ సెన్సార్‌ ఇస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

Tecno Spark 9T Launched

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Tecno Spark 9T వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.0, A-GPS, NFC, USB టైప్-C 2.0 పోర్ట్ క‌లిగి ఉంది.

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Tecno Spark 9 గురించి చ‌ర్చించుకుందాం:
ఈ Tecno Spark 9 మొబైల్ జులై 18న భార‌త మార్కెట్లో విడుద‌లైంది. ఈ వేరియంట్ octa-core MediaTek Helio G37 SoC ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. దీనికి 11 జీబీ వ‌ర‌కు ఎక్స్‌ప్యాండ‌బుల్ ర్యామ్ ఫీచ‌ర్‌ను క‌ల్పిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ప‌నిచేస్తుంది.

Tecno Spark 9T Launched

Tecno Spark 9 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లే కు వాట‌ర్ డ్రాప్ నాచ్ తో ఇస్తున్నారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత HIOS 8.6 ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 4GB, 6GB RAM| 64GB,128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Tecno Spark 9T వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు,Wi-Fi, బ్లూటూత్ 5.0, A-GPS, NFC, USB టైప్-C 2.0 పోర్ట్ క‌లిగి ఉంది.

భార‌త్‌లో ఈ Tecno Spark 9 ధ‌ర‌లు:
భార‌త్ మార్కెట్లో ఈ Tecno Spark 9 ని బ‌డ్జెట్ ధ‌ర‌లోనే విడుద‌ల చేశారు. రూ.10 వేల లోపు దీని ధ‌ర‌ను నిర్ణ‌యించారు. 4GB physical RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర‌ను కేవ‌లం రూ.8,499 గా నిర్ణ‌యించారు. ఇక‌పోతే 6GB physical RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర‌ను రూ.9,499 గా నిర్ణ‌యించారు. ఈ మొబైల్స్ ప్ర‌స్తుతం కొనుగోలు దారుల‌కు సేల్‌కు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది ఇన్‌ఫినిటి బ్లాక్‌, స్కై మిర్ర‌ర్‌ క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Tecno Spark 9T Launched In India; Costs Under Rs. 10,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X