Just In
- 4 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 6 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 23 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- News
సోనియాగాంధీ పావులు... ప్రియాంక అంగీకారం?? ఆ రాష్ట్రంపై పట్టుకు పడుతున్న అడుగులు
- Finance
5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Tecno Spark 9T బడ్జెట్ మొబైల్ సేల్స్ ప్రారంభం ఎప్పుడో తెలుసా..!
Tecno కంపెనీ Tecno Spark 9T మొబైల్స్ సేల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ మొబైల్‌ను కంపెనీ గత నెల ఆఖర్లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ వేదికగా ఆగస్టు 6వ తేదీన మిడ్‌నైట్ 12 గంటలకు సేల్ ప్రారంభించనుంది. ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. రేపు సేల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధరల పై మళ్లీ వివరంగా ఓసారి లుక్కేద్దాం.

Tecno Spark 9T ధరలు:
భారత మార్కెట్లో ఈ Tecno Spark 9T మొబైల్ జులై 28వ తేదీన విడుదలైంది. భారత్‌లో మార్కెట్లో ఈ మొబైల్ 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,299 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లో వినియోగదారులకు ఇది అట్లాంటిక్ బ్లూ, టాహితి గోల్డ్, ఐరిస్ పర్పుల్ కలర్లలో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా, ఈ Tecno Spark 9 మొబైల్స్ విక్రయాన్ని ఆగస్టు 6 న ఉదయం 12 గంటలకు అమెజాన్ ద్వారా కంపెనీ ప్రారంభించనుంది. కొనుగోళ్లు చేయడానికి SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుదారులకు 10 శాతం తగ్గింపు అందించబడుతుంది. అంతేకాకుండా, అమెజాన్‌లో Tecno Spark 9T క్విజ్ ద్వారా కూడా అమెజాన్‌పే కొనుగోలుదారులకు రూ.500 డిస్కౌంట్ లభించనుంది.

Tecno Spark 9T ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల (1,080x2,408 pixels) రిసొల్యూషన్‌తో full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G35 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ HiOS 7.6 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ 4GB of LPDDR4x RAM కెపాసిటీ తో, మెరుగైన పని తీరును కనబరుస్తుంది. దీనికి 4GB of LPDDR4x RAM| 64GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తున్నారు.
ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరొకటి 2 మెగాపిక్సెల్ క్వాలిటీలో పోర్ట్రయిట్ లెన్స్, ఏఐ సెన్సార్ ఇస్తున్నారు. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.
ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Tecno Spark 9T వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, NFC కనెక్టివిటీలను కలిగి ఉంది.

భారత్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Tecno Spark 9 గురించి చర్చించుకుందాం:
ఈ Tecno Spark 9 మొబైల్ జులై 18న భారత మార్కెట్లో విడుదలైంది. ఈ వేరియంట్ octa-core MediaTek Helio G37 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. దీనికి 11 జీబీ వరకు ఎక్స్‌ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్‌ను కల్పిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది.
Tecno Spark 9 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లే కు వాటర్ డ్రాప్ నాచ్ తో ఇస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత HIOS 8.6 ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది.
ఈ మొబైల్ 4GB, 6GB RAM| 64GB,128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ డ్యుయల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
భారత్‌లో ఈ Tecno Spark 9 ధరలు:
భారత్ మార్కెట్లో ఈ Tecno Spark 9 ని బడ్జెట్ ధరలోనే విడుదల చేశారు. రూ.10 వేల లోపు దీని ధరను నిర్ణయించారు. 4GB physical RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధరను కేవలం రూ.8,499 గా నిర్ణయించారు. ఇకపోతే 6GB physical RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. ఈ మొబైల్స్ ప్రస్తుతం కొనుగోలు దారులకు సేల్‌కు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది ఇన్‌ఫినిటి బ్లాక్, స్కై మిర్రర్ కలర్లలో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086