Home
Mobile

ధర రూ.7,299 కే 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

టెక్నో నుంచి ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌ లో స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. టెక్నో స్పార్క్‌ గో 1 (Tecno Spark Go 1) పేరుతో ఈ హ్యాండ్‌ సెట్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 పైన పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ను పొందవచ్చు. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అమెజాన్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ ను కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

టెక్నో స్పార్క్‌ గో 1 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
టెక్నో స్పార్క్‌ గో 1 స్మార్ట్‌ ఫోన్‌ 6.67 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600*720 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీప్రెష్‌ రేట్‌ను అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌, కెమెరా మాడ్యూల్‌ ఆకట్టుకుంటుంది. 15W వైర్‌ ఛార్జింగ్‌ సామర్థ్యంతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Tecno Spark Go 1 Smartphone news

ఈ టెక్నో హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందవచ్చని తెలుస్తోంది. మరియు Unisoc T615 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్‌, 128GB స్టోరేజీతో జత చేయబడుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ లో అందుబాటులో ఉంటుంది. కెమెరా విభాగం పరంగా టెక్నో స్పార్క్‌ గో 1 స్మార్ట్‌ఫోన్‌ 13MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ ను కలిగి ఉంటుంది.

Tecno Spark Go 1 Smartphone news

టెక్నో స్పార్క్ గో 1 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ టెక్నో అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ద్వారా సెప్టెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ మూడు రంగుల్లో లభిస్తుంది. లైమ్‌ గ్రీన్‌, గ్లిట్టరీ వైట్, స్టార్‌ట్రైల్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

* ఇటీవల టెక్నో తొలిసారిగా ట్రై ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను IFA బెర్లిన్‌లో విడుదల చేసింది. టెక్నో ఫాంటమ్ అల్టిమేట్‌ 2 కాన్సెప్ట్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్ 2024 లో ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా విడుదల చేసింది. ఈ ఫాంటమ్‌ ట్రై ఫోల్డ్‌ కాన్సెప్ట్‌ ఫోన్‌ 10 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది.

టెక్నో ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1620*2880 పిక్సల్ రిజల్యూషన్‌ తో 6.48 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే మరియు 10 అంగుళాల LTPO OLED ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ టచ్‌ మరియు డిస్‌ప్లే ఇంటిగ్రేషన్‌ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ గా టెక్నో చెబుతోంది. డిస్‌ప్లే డ్రైవర్‌, టచ్‌ సెన్సార్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Spark Go 1 Smartphone with 5000mAh battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X