Home
Mobile

రూ.6999 కే నెట్‌వర్క్‌ లేకపోయినా కాల్స్ చేసుకోగలిగే ఫోన్‌.. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ..!

టెక్నో స్పార్క్ గో 2 స్మార్ట్‌ఫోన్ ఇవాళ లాంచ్ అయింది. ఈ ఫోన్‌ ఫ్రీ లింక్‌ యాప్‌ను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల ల్యాగ్‌ ఫ్రీ పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకమైన ఫీచర్‌ కూడా ఉంది. నెట్‌వర్క్‌ లేకుండానే కాల్స్‌ చేసుకొనేందుకు వీలుంటుంది. ఈ ఫోన్‌ ధర రూ.6999 గా ఉంది.

టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్‌ (Tecno Spark Go 2 Smartphone) 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 720 X 1600 పిక్సల్ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఈ ఫోన్‌ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

Tecno Spark Go 2 Smartphone

ఈ ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్, 64GB eMMC 5.1 ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.

నెట్‌వర్క్ లేకున్నా కాల్స్‌! :
ఈ టెక్నో ఫోన్‌లో ఆసక్తికరమైన ఫీచర్‌ ఉంది. టెక్నో స్పార్క్‌ గో 2 ఫోన్‌ నుంచి నెట్‌వర్క్ లేకున్నా కాల్స్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. ఫ్రీ లింక్‌ యాప్‌ ద్వారా సాధ్యమవుతుందని తెలిపింది. దీని ద్వారా సెల్యూలర్‌ కనెక్టివిటీ లేకుండానే కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

టెక్నో స్పార్క్‌ గో 2 ఫోన్‌ నుంచి మరో టెక్నో స్పార్క్‌ గో 2 మోడల్‌కు నెట్‌వర్క్‌ లేకున్నా కాల్స్‌ చేసుకోవచ్చు. అదే విధంగా స్పార్క్‌ గో 2 నుంచి టెక్నో పోవా సిరీస్ మధ్య కూడా ఈ సౌకర్యం ఉంది. దీంతోపాటు రెండు టెక్నో పోవా సిరీస్‌ మోడల్స్ మధ్య కూడా ఈ సౌకర్యం ఉంది.

Tecno Spark Go 2 Smartphone

AI అసిస్టెంట్‌ :
టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్‌ Ella AI అసిస్టెంట్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ AI అసిస్టెంట్‌ అనేక భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుంది. అయితే మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ, ఇంటర్నెట్‌ స్పీడ్‌ కోసం Aggregation 2.0 మరియు Linkbooming V1.0 టెక్నాలజీని కలిగి ఉంది.

5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ 15W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్ కూడా ఉంది.

Take a Poll

టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. జులై 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ఇంక్‌ బ్లాక్‌, టైటానియం గ్రే, వీల్‌ వైట్‌, టర్కోయిస్‌ గ్రీన్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Tecno Spark Go 2 Smartphone launched with free link app in india at rs6999 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X