నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకొనే స్మార్ట్‌ఫోన్.. ధర రూ.6999.. ఇవాళ్టి నుంచే సేల్ ప్రారంభం..!
Tecno Spark Go 2 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ టెక్నో నుంచి ఇటీవల స్పార్క్ గో 2 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఏఐ అసిస్టెంట్‌తోపాటు నెట్‌వర్క్ లేకుండా కాల్స్ చేసుకొనే ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. ఎంట్రీ లెవల్ ధరలో ఫోన్లు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ హ్యాండ్ సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
ఇవాళ్టి నుంచే సేల్ ప్రారంభం :
టెక్నో స్పార్క్ గో 2 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ టర్కోయిస్ గ్రీన్, టైటానియం గ్రే, వీల్ వైట్, ఇంక్ బ్లాక్ కలర్ వేరియంట్ లో లభిస్తుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
టెక్నో స్పార్క్ గో 2 స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 64GB eMMC 5.1 తో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ లోనే అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే, కెమెరా వివరాలు :
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 13MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్ ను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

బ్యాటరీ, ఏఐ అసిస్టెంట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు Ella AI అసిస్టెంట్ ను సపోర్టు చేస్తుందని టెక్నో తెలిపింది. ఈ ఏఐ అసిస్టెంట్ భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు..! :
ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ ఫ్రీ లింక్ యాప్ ద్వారా నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే టెక్నో మొబైల్స్ మధ్యలోనే ఈ యాప్ ద్వారా నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
టెక్నో స్పార్క్ గో 2 స్మార్ట్‌ఫోన్ ల మధ్య నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. స్పార్క్ గో 2 నుంచి టెక్నో పోవా సిరీస్ ల మధ్య కూడా నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు. టెక్నో పోవా సిరీస్‌ల మధ్య పరస్పరం కాలింగ్ కు అవకాశం ఉంది. Aggregation 2.0, Linkbooming V1.0 టెక్నాలజీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








