Home
Mobile

IP64 రేటింగ్‌, డ్రాప్‌ రెసిస్టెంట్, వాయిస్ అసిస్టెంట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌..!

Tecno Spark Go 3 Smartphone : టెక్నో గత సంవత్సరం భారత్ మార్కెట్‌లో స్లిమ్ డిజైన్‌తో టెక్నో పోవా స్లిమ్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.20 వేల ధర సెగ్మెంట్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే టెక్నో నుంచి తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివరాలు వెల్లడయ్యాయి. టెక్నో స్పార్క్ గో 3 పేరుతో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌ల వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది :
టెక్నో స్పార్క్‌ గో 3 స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో జనవరి 16 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్‌ సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌ మైక్రోసైట్‌ ద్వారా ఈ ఫోన్‌ డిజైన్‌, అనేక ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.

Tecno Spark Go 3

బ్లూ కలర్ వేరియంట్ :
తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా టెక్నో స్పార్క్‌ గో 3 స్మార్ట్‌ఫోన్‌ బ్లూ కలర్‌ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. విడుదల సమయంలో మరిన్ని కలర్‌ వేరియంట్స్‌ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అమెజాన్‌ మైక్రోసైట్‌ ఆధారంగా ఈ టెక్నో ఫోన్‌ పిల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. స్పీకర్‌ గ్రిల్‌ ఫోన్ పైభాగంలో ఉంది. పవర్‌, వాల్యూమ్ బటన్లు ఫోన్‌ కుడివైపున ఉన్నాయి. ఈ ఫోన్ 4 సంవత్సరాల వరకు ల్యాగ్‌ ఫ్రీ పనితీరును అందిస్తుందని చెబుతోంది.

డ్రాప్‌ రెసిస్టెంట్ :
ఈ ఫోన్ 1.2 మీటర్ల వరకు డ్రాప్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆఫ్‌లైన్‌ కాలింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. టెక్నో స్మార్ట్‌ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. Ella వాయిస్ అసిస్టెంట్‌ను సపోర్టు చేస్తుంది. 5 ప్రాంతీయ భాషలను సపోర్టు చేస్తుందని టెక్నో చెబుతోంది.

టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్ :
ఈ టెక్నో ఫోన్‌ డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్‌, కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.6699 గా ఉంది. టాప్‌ వేరియంట్‌ ధర రూ.7499 గా ఉంది.

టెక్నో స్పార్క్‌ గో 2 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Unisoc T7250 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 15W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్రీ లింక్‌ యాప్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా నెట్‌వర్క్‌ లేకున్నా కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే కేవలం టెక్నో ఫోన్‌ల మధ్యనే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Spark Go 3 Smartphone launch date revealed in india here are the confirmed features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X