రూ.8999 ధరకు డ్రాప్ రెసిస్టెంట్, HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ విడుదల..!
టెక్నో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. టెక్నో స్పార్స్ గో 3 పేరుతో (Tecno Spark Go 3 Smartphone) అందుబాటులోకి వచ్చింది. ఎంట్రీ లెవల్ ధరలో ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. నాలుగు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయింది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తోపాటు డ్రాప్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్రాప్ రెసిస్టెంట్ గా ఉంది. 1.2 మీటర్ల నుంచి కింద పడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుందని చెబుతోంది. దీంతోపాటు IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

ఆండ్రాయిడ్ 15 OS :
ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T7250 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. 64GB ఇన్‌బిల్ట్ స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది. 4GB/64GB స్టోరేజీతో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా ఉంది. దీంతోపాటు డ్యూయల్ LED ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 15W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ Ella AI సపోర్టును కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ హిందీ, తమిళం, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ వంటి ఐదు స్థానిక భాషలను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ బేస్‌మెంట్స్, భారీ నిర్మాణ ప్రదేశాలు, గ్రామీణ ప్రాంతాల వంటి తక్కువ నెట్‌వర్క్ సామర్థ్యం కలిగినా ప్రాంతాల్లోనూ ఈ ఫోన్ తో ఎటువంటి అంతరాయాలు లేని కనెక్టివిటీ సాధ్యమవుతుందని టెక్నో చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా 4G LTE, బ్లూటూత్, వైఫై, GPS, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. ఆడియో కోసం సింగిల్ స్పీకర్ ఉంది.

టెక్నో స్పార్క్ గో 3 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. అమెజాన్ లో జనవరి 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. రిటైల్ స్టోర్స్ లోనూ లభిస్తుంది. టైటానియం గ్రే, గెలాక్సీ బ్లూ, ఇంక్ బ్లాక్, ఆరోరా పర్పుల్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








