రూ.9999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్.. AI సహా సూపర్ ఫీచర్లు..!
Tecno Spark Go 5G Smartphone : టెక్నో సంస్థ భారత్ మార్కెట్‌లో టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ ధరలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ డైనమిక్ పోర్ట్ ఫీచర్, డాట్ ఇన్ డిస్‌ప్లే వంటి అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు అనేక AI ఫీచర్‌లను కలిగి ఉంది. టెక్నో స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.
టెక్నో స్పార్స్ గో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ టెక్నో ఫోన్ 6.74 అంగుళాల HD+ ఫ్లాట్ (1600 x 720 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 194 గ్రాములు బరువును కలిగి ఉంది.

మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 చిప్‌సెట్ :
ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు Arm Mali G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా తో 30fps వద్ద 2K వీడియోను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ Ella AI అసిస్టెంట్‌ను కలిగి ఉంది. అనేక భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. ఇందులో AI కాల్ అసిస్టెంట్, AI ఆటో ఆన్సర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. AI వాయిస్ ప్రింట్ నాయిస్ సస్పెన్షన్ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
IP64 రేటింగ్, DTS ఆడియో సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం DTS సపోర్టుతో స్పీకర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, డ్యూయల్ VoLTE, వైఫై, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. ఆగస్టు 21 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








