Home
Mobile

రూ.10 వేల కంటే తక్కువ ధరలో 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ టెక్నో నుంచి ఈ నెల రెండో వారంలో టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్‌ఫోన్‌ ( Tecno Spark Go 5G Smartphone ) విడుదల అయింది. ఈ ఫోన్‌ ఎంట్రీ లెవల్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ కూడా ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ కార్డుపై డిస్కౌంట్ :
టెక్నో స్పార్క్‌ గో 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌ లో అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్ బ్యాంకు కార్డులతో 5 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

tenco spark go 5G smartphone with 6000mAh battery available at rs9999 on flipkart

కలర్ వేరియంట్స్ :
టెక్నో స్పార్స్‌ గో 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ ఫ్లాట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 1600 x 720 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 670 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ టెక్నో హ్యాండ్‌సెట్‌ స్కై బ్లూ, టర్కోయిస్‌ గ్రీన్‌, ఇంక్‌ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

ఈ టెక్నో హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. Arm Mali G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది.

నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ :
ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్ Ella AI అసిస్టెంట్‌ ను కలిగి ఉంది. AI కాల్‌ అసిస్టెంట్‌, AI Auto Answer వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు AI వాయిస్‌ ప్రింట్‌ నాయిస్‌ సస్పెన్షన్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్‌ చేసుకోవచ్చు.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్‌ లైట్‌ ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా 30fps వద్ద 2K వీడియోను రికార్డు చేయవచ్చు. మెరుగైన ఆడియో కోసం DTS సపోర్టుతో స్పీకర్‌ ను కలిగి ఉంది.

6000mAh భారీ బ్యాటరీ :
ఈ టెక్నో ఫోన్ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ను అమర్చారు. 5G, 4G VoLTE, WiFi, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
tenco spark go 5G smartphone with 6000mAh battery available at rs9999 on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X