రూ.9999 ధరకే 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్!
టెక్నో సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఎంట్రీ సహా బడ్జెట్ ఫోన్‌లు ఉన్నాయి. ఈ సంవత్సరం రెండు భాగంలో టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకొ గలిగే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
మూడు కలర్ వేరియంట్స్ :
టెక్నో స్పార్స్ గో 5G స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.9999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ ఇంక్ బ్లాక్, స్కై బ్లూ, టర్కోయిస్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

ఫ్లాట్ డిస్‌ప్లే, IP64 రేటింగ్ :
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.74 అంగుళాల (1600 x 720 పిక్సల్స్) HD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 670 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్ ప్రాసెసర్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ Arm Mali G57 MC2 GPU ను కూడా అమర్చారు.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్ ను అమర్చి ఉంది. ఈ కెమెరా 30fps వద్ద 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
6000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ Ella AI ను కలిగి ఉంది. AI ఆటో ఆన్సర్, AI కాల్ అసిస్టెంట్ ఉన్నాయి. దీంతోపాటు నెట్‌వర్క్ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్ చేసుకొనే విధంగా ప్రత్యేక ఫీచర్ ఉంది.
DTS స్పీకర్ :
ఈ హ్యాండ్‌సెట్ (Tecno Spark Go 5G Smartphone) 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం DTS స్పీకర్ ను అమర్చి ఉంది.


Click it and Unblock the Notifications








