Home
Mobile

6000mAh భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌.. సిగ్నల్‌ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు..!

Tecno Spark Go 5G Smartphone : టెక్నో స్పార్క్‌ గో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ గూగుల్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌ సహా అనేక బెస్ట్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుందని చెబుతోంది. ఈ ఫోన్‌ AI అసిస్టెంట్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ విడుదల తేదీ సహా ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
టెక్నో స్పార్క్‌ గో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో ఆగస్టు 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ 7.99mm థిక్‌నెస్‌తో 194 గ్రాముల బరువును కలిగి ఉంటుందని టెక్నో తెలిపింది.

Tecno Spark Go 5G Smartphone

నెట్‌వర్క్‌ లేకున్నా కాల్స్ :
టెక్నో స్పార్క్‌ గో 5G స్మా్ర్ట్‌ఫోన్‌ ఫ్రీ లింక్‌ యాప్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లోను కాల్స్‌ చేయడం, SMS పంపించేందుకు అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. టెక్నో టూ టెక్నో ఫోన్‌లలో మాత్రమే ఈ ఫీచర్‌ సపోర్టు చేస్తుంది.

ఏఐ ఫీచర్లు :
ఈ ఫోన్‌ Ella AI అసిస్టెంట్‌ను సపోర్టును కలిగి ఉంటుంది. ఈ ఏఐ అసిస్టెంట్ అనేక భారతీయ భాషలను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు సర్కిల్‌ టూ సెర్చ్‌, AI రైటింగ్ అసిస్టెంట్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. ఈ టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర సహా డిస్‌ప్లే, కెమెరా, చిప్‌సెట్‌ సహా అనేక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గత నెలలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు :
గత నెలలో టెక్నో నుంచి టెక్నో పోవా 7 5G, పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌ బేస్‌ వేరియంట్ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది. అదే ప్రో మోడల్‌ ప్రారంభ ధర రూ.18999 గా ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ ఫ్లాట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Spark Go 5G Smartphone with 6000mAh battery will launch on august 14 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X