టెక్నో టెలికామ్... సరికొత్త లాంచ్

Posted By: Prashanth

టెక్నో టెలికామ్... సరికొత్త లాంచ్

 

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్ధ టెక్నోటీఐ, తన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కావటంతో మార్కెట్ అంచనాలు భారీగా నెలకున్నాయి. సంస్థ తాజాగా వెలువరించిన ప్రకటనతో నైజీరియా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్యూయల్ సిమ్ నెట్‌వర్కింగ్ సౌలభ్యత కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ ఫీచర్లను ఒదిగి ఉంది. అత్యుత్తమమైన నెట్ బ్రౌజింగ్ అనుభూతిని యూజర్ పొందవచ్చు.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం,

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,

3 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

సెన్సార్ ఆప్షన్స్.

ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఇంటెలిజెంట్ టెర్మినల్ వ్యవస్థ సౌలభ్యతతో వాల్యూ యాడెడ్ అప్లికేషన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఏర్పాటు చేసిన టచ్‌స్ర్నీన్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. ఫోన్ ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డ్యూయల్ కమెరా వ్యవస్థ ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా సాయంతో అంతరాయంలేని ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు సహకరిస్తుంది. ఏర్పాటు చేసిన మల్టీమీడియా వ్యవస్థ హైక్వాలిటీ వినోదాలను చేరువచేస్తుంది. ప్రధానంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఈ గ్యాడ్జెట్‌ను డిజైన్ చేశారు. ధర ఇంకా ఇతర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot