20 సెకన్లలో ఫోన్ ఛార్జింగ్!

Posted By:

ఛార్జింగ్ పూర్తిగా అయిపోవటం కారణంగా మీ ఫోన్ అనేక సందర్భాల్లో స్విచాఫ్ అయిఉండొచ్చు. ఇక పై ఈ బెడద మిమ్మల్ని వెంటాడదు. కేవలం 20 సెకన్ల వ్యవధిలో మీ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రాబోతుంది. వివరాల్లోకి వెళితే... భారత సంతతికి అమెరికా యువతి ఈషాఖరే (18), 20 సెకన్ల నుంచి 30 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ ఛార్జ్ అయ్యేలా శక్తివంతమైన సూపర్ కెపాసిటర్‌ను అభివృద్ధి చేసి ఉత్తమ యువ శాస్త్రవేత్తగా ప్రశంసలనందుకుంది.

కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఈమెకు ఇంటెల్ ఫౌండేషన్ యువ శాస్త్రవేత్త అవార్డును ప్రధానం చేసపింది. ఈ పరికరాన్ని మరింతగా అభివృద్ధిపరిచేందుకుగాను ఇంటెల్ సంస్థ ఈషాఖరేకు రూ.27.50 లక్షల నిధులను మంజూరు చేసింది. నానో కెమిస్ట్రీ విభాగంలో ఖరేకు మంచి పట్టు ఉండటంతో ఆమెకు ఈ ఆవిష్కరణ సాధ్యమైంది. ఈషాఖరే రూపొందించిన సూపర్ కెపాసిటర్ విశేషాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 సెకన్లలో ఫోన్ ఛార్జింగ్!

1.) తక్కువ చోటులో ఎక్కువ విద్యుత్ను నిల్వ చేయగల సామర్ధ్యం ఉండటమే ఖరే రూపొందించిన సూపర్ కెపాసిటర్‌లోని ప్రత్యేకత.

20 సెకన్లలో ఫోన్ ఛార్జింగ్!

2.) ఖరే రూపొందించిన పరికరాన్ని త్వరలోనే ఫోన్లలో, కార్లలో అనుసంధానించి పరీక్షించనున్నారు.

20 సెకన్లలో ఫోన్ ఛార్జింగ్!

3.) సాధరాణ బ్యాటరీని 1000 సార్లు ఛార్జ్ చేస్తే.. ఖరే రూపొందించిన సూపర్ కెపాసిటర్‌ను 10,000 సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot