ఎయిర్‌టెల్ సహా ఐదు టెలికాం సంస్థలకు డాట్ షోకాజ్ నోటీసులు..?

Posted By: Prashanth

ఎయిర్‌టెల్ సహా ఐదు టెలికాం సంస్థలకు డాట్ షోకాజ్ నోటీసులు..?

 

ఓ ప్రత్యేక ఆడిట్ నివేదిక ప్రకారం 2006-2008 అసెస్‌మెంట్ సంవత్సరాల కాలానికి తమ ఆదాయాన్ని తగ్గించి చూపినందుకు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఆర్‌కామ్ తదితర ఐదు ప్రైవేట్ టెలికాం సంస్థలకు టెలికాం శాఖ (డాట్) మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఇందుకుగాను ఈ కంపెనీలు రూ.1637 కోట్లు బకాయిలు కింద చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. టాటాస్, ఐడియా సెల్యులార్ కంపెనీలకు సైతం డాట్ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై 21 రోజుల్లోగా

స్పందించాలని సూచించింది.

అలాగే ఈ ఐదు కంపెనీల నుంచి డాట్ రూ.1637 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులపై గడువు పూర్తి కాగానే ఆయా కంపెనీలు టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబాల్‌ను వ్యక్తిగతంగా కలిసి దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు సమాచరాం. కాగా, డాట్ జారీచేసిన నోటీసులు తమకు అందినట్లు వీటిలో కొన్ని కంపెనీలు ధ్రువీకరించాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting