Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 8 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
ఆయన మళ్లీ.. చంద్రబాబువైపు చూస్తున్నారే!!
- Sports
INDvsAUS : కోహ్లీపై కన్నేయండి.. అదే జరిగితే ఇండియాదే విజయం: మాజీ కోచ్
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం..
కొంత మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలా వ్యవహరించటం వల్ల వారి నిర్లక్ష్యమే వారిని ఇరకాటంలోకి నెట్టేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలోకి హ్యాకర్లు సునాయాశంగా మాల్వేర్లను జొప్పించి డేటాను నాశనం చేయగలుగుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అవనగాహన లేకుండా మనం చేసే చిన్నితప్పిదాలే మన ఫోన్‌ను ఇరకాటంలో పడేస్తుంది.

లాక్ ఏర్పాటుచేసుకోకపోతే..
స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయకపోవటం కూడా సెక్యూరిటీ తప్పిదమేనంటున్నారు సెక్యూరిటీ నిపుణులు. మీ ఫోన్‌కు లాక్ ఏర్పాటు చేయని పక్షంలో ఎవరు పడితే వాళ్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.

పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్ సురక్షితం కాదు..
పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్‌లు చాలానే ఉంటాయి. ఇలాంటి చోటే మీ ఫోన్‌ను మాల్వేర్లు చుట్టిముట్టే ప్రమాదముంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ముందు ఆచితూచి స్పందించండి.

బ్రౌజింగ్ విషయంలో జాగ్రత్త...
ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీ లింక్ పై క్లిక్ చేయటం కూడా సెక్యూరిటీ తప్పిదం లాంటిదేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యే కొన్ని లింక్స్ ప్రమాదకర మాల్వేర్లను కలిగి ఉంటాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా మాల్వేర్ మీ ఫోన్‌లోని డేటాను నాశనం చేసేస్తుంది.

యాప్స్ విషయంలో జాగ్రత్త..
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన అప్లికేషన్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్లే స్టోర్‌ను కాదని థర్డ్ పార్టీ సోర్సుల నుంచి యాప్స్ తీసుకోవటం ద్వారా సెక్యూరిటీ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇన్‌స్టాల్ చేసుకునే ప్రతియాప్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేముందు వెరిఫికేషన్ అనేది చాలా అవసరం.

యాంటీ వైరస్ తప్పనిసరి..
చాలామంది తమ స్మార్‌ఫోన్‌లలో యాంటీ వైరస్‌ను ఇన్స్‌స్టాల్ చేయరు. వాళ్ల ఫోన్ రిస్క్‌లో ఉందనటానికి ఇదే తొలి సంకేతం. యాంటీవైరస్ సపోర్ట్‌లేని ఫోన్‌లను ఏ నిమిషంలోనైనా మాల్వేర్లు చుట్టుముట్టే ప్రమాదముంది.

నెక్షన్‌లను ఎప్పుడు ఆన్‌చేసి ఉంచటం వల్ల...
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వైర్‌లెస్ కనెక్షన్‌లను ఎప్పుడు ఆన్‌చేసి ఉంచటం వల్ల కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. జీమెయిల్, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ అకౌంట్‌లను లాగ్ అవుట్ చేయకుండా మర్చిపోవటం కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.

వ్యక్తిగత డేటాను మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేయటం
అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత డేటాను మొబైల్ ఫోన్‌లో స్టోర్ చేయటం ఏ మాత్రం మంచిది కాదని సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. కొంత మంది ఇవేమి పట్టించుకోకుండా తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో పాటు పిన్ కోడ్‌లను ఫోన్‌లలోనే ఫీడ్ చేస్తుంటారు. పొరపాటున ఇలాంటి వారి ఫోన్ హ్యాక్‌కు గురైతే బోలెండత నష్టం వాటిల్లుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470