అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు, అత్యధ్బుతమైన ఫీచర్లు
స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే.
స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ తమ నూతన స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించాయి. శాంసంగ్, ఎల్‌జీ, మైక్రోసాఫ్ట్, షియోమి, హెచ్‌ఎండీ గ్లోబల్, హువాయి లాంటి కంపెనీలు తమ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి.ముఖ్యంగా ఎండబ్ల్యూసీ 2019 షోలో శాంసంగ్‌కు పోటీగా హువాయి ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది.ఎల్‌జీ జీ8 థింక్యూ, వన్ ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రదర్శించింది. అలాగే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 9 ప్యూర్ వ్యూను, 8.1 ప్లస్‌ను, సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్లస్ , ఎల్3 ఫోన్లను, బ్లాక్‌బెర్రీ కీ 2 రెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఓ సారి పరిశీలిస్తే..

Energizer Power Max P18K POP
యూజర్లు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లను ఇష్టపడుతున్న తరుణంలో Energizer అనే సంస్థ కూడా భారీ బ్యాటరీతో సరికొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. కంపెనీ Energizer Power Max P18K POP పేరుతో ఫోన్ ని తీసుకొస్తోంది. ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్డిస్ప్లే,మీడియా టెక్ P70 ప్రాసెసర్,6 జీబీ ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. మెమరీ కార్డు ద్వారా అదనంగా మరో 128జీబి స్టోరేజ్ పొందొచ్చు. ఈ ఫోన్లో కూడా ప్రత్యేకంగా పాపప్ కెమెరాను పొందుపరిచారు. ఫోన్ ముందు భాగంలో 16 మరియు 2 మెగాపిక్సల్ కలిగిన రెండు కెమెరాలు, వెనుక భాగంలో, 12, 5 మరియు 2 మెగా పిక్సల్ రిజల్యూషన్ కలిగిన మరో రెండు కెమెరాలు ఉంటాయి. 4K క్వాలిటీ కలిగిన వీడియోలను రికార్డ్ చేయవచ్చు.ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్డిస్ప్లే,మీడియా టెక్ P70 ప్రాసెసర్,6 జీబీ ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. మెమరీ కార్డు ద్వారా అదనంగా మరో 128జీబి స్టోరేజ్ పొందొచ్చు.

Nomu T18
జాంబెల్ పైటర్ అదిరిపోయే టెక్నాలజీతో దూసుకొస్తోంది. IP68 water resistance, a built-in VHF/UHF walkie-talkie, anti-explosion hardening, fingerprint recognition, a replaceable 3,200mAh battery లాంటి ఫీచర్లతో దుమ్మురేపేందుకు సిద్ధమైంది.

HiSense A6
రెండు డిస్ ప్లేలతో ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఒకటి OLED కాగా రెండోది e-ink.రెండో ఫీచర్ ద్వారా మీరు ఈ బుక్స్ ని వెనుక భాగంలో చదివేయవచ్చు.

Nubia Alpha
ఇది స్మార్ట్ ఫోన్ లాగానే ఉన్నా నిజానికి ఇది ఒక స్మార్ట్ వాచ్. దీని ద్వారా మీరు అన్ని రకాల కాల్స్ చేసుకోవచ్చు. ఫోనలో ఉండే అన్ని రకాల ఫీచర్లు ఈ వాచీలో అందుబాటులో ఉంటాయి.

FXtec
ఈ కంపెనీ తొలిసారిగా అదిరిపోయే ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్లో ప్రధాన ఆకర్ష కీ బోర్డ్ . OLED డిస్ ప్లేతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








