Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 19 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 22 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
Reactor Blast: అచ్యుతాపురంలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి..
- Lifestyle
హైబ్లడ్ ప్రెజర్ ను తక్కువగా అంచానా వేయకండి..ఇది ఎలా ప్రాణం తీస్తుందో తెలుసా?
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా, ప్రత్యేకతమైన ఫీచర్లు ఏంటీ..?
హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లతో తన పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరిస్తోంది. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 వేదికగా ఐదు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించింది. నోకియా 8 సిరొక్కో, నోకియా 7 ప్లస్, నోకియా 6(కొత్త వేరియంట్), నోకియా 1, పునరుద్ధరించిన నోకియా 8110లతో మార్కెట్లో మొబైల్ గుబులు పుట్టిస్తోంది. అయితే వీటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నోకియా 8110 గురించే..ఇది జియోఫోన్ కు పోటీగా మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ను ప్రస్తుతం 4జీ కనెక్టివిటీతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి యాప్స్‌తో కంపెనీ ఆవిష్కరించింది. పన్నులు, ఇతర సబ్సిడీలను మినహాయించి నోకియా ఐకానిక్ మోడల్ అయిన 8110 ధరను హెచ్‌ఎండీ గ్లోబల్ 79 యూరోలుగా నిర్ణయించింది. మే నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుంది. మరి రెండింటి మధ్య తేడాలను పరిశీలిద్దాం.

జియో ఫోన్ ఫీచర్లు
2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు
2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హార్డ్‌వేర్
నోకియా 8110 4జీ ఫోన్ 1.1Ghz dual-core Qualcomm 205 మొబైల్ ప్రాసెసర్ తో పాటు 512MB RAM/ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది.అలాగే విస్తరణ సామర్ధ్యం కూడా ఉంది. 2 ఎంపీ కెమెరాతో పాటు 1,500mAh battery ఉంది. అలాగే 4జీ వోల్ట్ కనెక్షన్ మీద 9.32 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇక జియోఫోన్లో Qualcomm 205తో పాటు 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఉంది. అయితే కెమెరా మాత్రం రెండు ఒకటి అయినప్పటికీ జియో ఫోన్లో 0.3 మెగా ఫిక్సల్ కెమెరాను పొందుపరిచారు. కాగా బ్యాటరీ 2,000mAhతో నోకియా కన్నా ముందు వరసలోనే ఉంది. రెండు ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ఫీచర్లు
రెండు ఫోన్లు KaiOSతో రాగా Firefox OS మీద రన్ అవుతాయి. కాగా నోకియా బనానా ఫోన్ సొంత యాప్స్ తో వచ్చింది. Facebook, Twitter, Google Maps, Google Assistan, Snakeగేమ్ లాంటివి ఇందులో ఉన్నాయి. ధర్డ్ పార్టీ యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్ కూడా ఇందులో వస్తోంది. ఇంకా మరిన్ని ఫీచర్లను అందుబాటలోకి తీసుకువస్తామని HMD చెబుతోంది.
కాగా జియోలో కేవలం జియోకి సంబంధించిన యాప్స్ మాత్రమే ఉన్నాయి. JioTV, JioMusic, JioExpress, JioCinema, JioMessaging and Jio Video Call లాంటివి ఉన్నాయి. ఈ మధ్యనే Facebook and Google Assistant ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా జియో ఫోన్ JioMoney ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పిస్తోంది. అలాగే టీవి సదుపాయం కూడా ఉంది.

డిజైన్, ధర
కాగా డిజైన్లో నోకియా 8110 స్టైలిష్ గా కనిపిస్తుంది. స్లైడర్ దగ్గర నుంచి కీ బోర్డ్ దాకా అంతా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే జియోఫోన్లో ఆ అవకాశం లేదు. ఫోన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక ధర విషయానికొస్తే నోకియా 8110పై క్లారిటీ లేదు. హెచ్‌ఎండీ గ్లోబల్ దీని ధరను 79 యూరోలుగా నిర్ణయించినప్పటికీ ఇండియాలో ఇది మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేలో ఇది ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. అయితే జియో ఫోన్ రూ.1500 రీఫండ్ తో మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్
వీటితో పాటుగా ఏప్రిల్ ప్రారంభం నుంచి నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలవుతోంది. 5.5 అంగుళాల క్యూహెచ్‌డీ పీఓలెడ్ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5, ఆక్టా-కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 12 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీనిలో ఫీచర్లు. నోకియా 8 సిరొక్కో స్మార్ట్‌ఫోన్ ధర 749 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.60వేలుగా తెలుస్తోంది. కానీ భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండొచ్చో కంపెనీ వెల్లడించలేదు.

నోకియా 6
ఇక కొత్త నోకియా 6 ముందు దాని కంటే 60 శాతం వేగవంతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 279 యూరోలకు కంపెనీ మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అయిన నోకియా 1, మృదువుగా డిజైన్ అయింది. గూగుల్ ప్లే స్టోర్ ఫుల్ యాక్సస్‌తో దీన్ని ఆవిష్కరించింది. దీని ధర కూడా అన్ని పన్నులు, సబ్సిడీలు కలుపుకోకపోతే, 85 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.

నోకియా 1 ఫీచర్లు
లైట్ వెయిట్ వర్షన్లో వస్తున్న నోకియా 1ను బడ్జెట్ ధరకే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు HMD Global సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్లో అన్ని రకాల గూగుల్ యాప్స్ ఉండే అవకాశం ఉంది. కాగా నోకియా బ్రాండ్ లలో వచ్చిన ఫోన్ల అన్నింటింకంటే ఈ ఫోన్ బెస్ట్ వర్షన్ పోన్ గా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ధరను కంపెనీ 85 అమెరికన్ డాలర్లకు (దాదాపుగా రూ.5,500) గా నిర్ణయించింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అధికారికంగా ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో వినియోగదారులకు లభ్యం కానుంది.
ఫీచర్లు ఇవే..
4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఓఎస్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470