బడ్జెట్ ధరలో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో దిగ్గజ కంపెనీలు ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్లతో దిగ్గజ కంపెనీలు ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మధ్యతరగతి వారినే టార్గెట్ గా కంపెనీలు అత్యంత తక్కువ ధరకే మంచి ఫీచర్లు గల ఫోన్లను అందిస్తున్నాయి. చైనా కంపెనీలు, అలాగే దేశీయ కంపెనీలు పోటీ పడుతూ వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

వాట్సప్ sexting ట్రాప్, పురుషులే టార్గెట్, కొత్త దందావాట్సప్ sexting ట్రాప్, పురుషులే టార్గెట్, కొత్త దందా

కోమియో ఎక్స్1

కోమియో ఎక్స్1

రూ.7,499 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. ఐడియా సెల్యులార్ ఈ ఫోన్‌పై నెలకు 10 జీబీ చొప్పున 6 నెలలకు గాను మొత్తం 60 జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది.
కోమియో ఎక్స్1 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

కామన్ ఐ ట్విన్‌

కామన్ ఐ ట్విన్‌

రూ.11,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తున్నది.
టెక్నో కామన్ ఐ ట్విన్ ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లావా జడ్61

లావా జడ్61

రూ.5,750 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
లావా జడ్61 ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1/2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇంటెక్స్ ఇండీ 5

ఇంటెక్స్ ఇండీ 5

రూ.4,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.
ఇంటెక్స్ ఇండీ 5 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐటెల్ ఎ62

ఐటెల్ ఎ62

రూ.7,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఐటెల్ ఎ62 ఫీచర్లు
5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
The best budget smartphones launched in this week: what you can get More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X