2018లో నోకియా నుండి వచ్చిన ఉత్తమమైన ఫోన్లు

Posted By: ChaitanyaKumar ARK

చాలాకాలం తర్వాత నోకియా, ఫిన్నిష్ కంపెనీ అయిన HMD గ్లోబల్ తో కలిసి ఫోన్లను మరలా మార్కెట్ లోకి తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. నోకియా అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఇది అని చెప్పవచ్చు. అలా వచ్చిన ఫోన్లలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఇక్కడ పొందుపరచడం జరిగినది. నోకియా తన ఫోన్లను ఆవిష్కరిస్తూనే సెక్యూరిటీ అప్డేట్లు మరియు భవిష్యత్తు లో OS అప్డేట్ల గురించిన హామీతో దూసుకుని వచ్చింది. తద్వారా వినియోగదారుల దృష్టిలో నమ్మకాన్ని పునర్నిర్మించుకుంది. ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన విషయాల ప్రకారం నోకియా యొక్క అన్నీ డివైజులకి ఆండ్రాయిడ్ OREO అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది. ఇదేవిధంగా ప్రతి మొబైల్ కి మూడేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్ ప్రామిస్ చేసింది HMD గ్లోబల్. ఇక్కడ జాబితా చేయబడిన లిస్టు 2017 నుండి ఉన్నాయి, కానీ MWC ఈవెంట్ లో నోకియా 5 ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో కొన్ని ఈ సంవత్సరం చివరలో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేయదగిన ఉత్తమమైన నోకియా స్మార్ట్ ఫోన్ల లిస్ట్..

మరోసారి భారీ ఆఫర్లతో దూసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్, ఈ సారి టీవీలపై..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

NOKIA 8 :

స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ తో, ఉత్తమమైన హార్డ్వేర్ డిజైన్, 64 జి‌బి ఇంటర్నల్ మెమరీ ,4 జి‌బి రామ్,2k డిస్ప్లే , డ్యూయల్ కెమరా, 3090 mah బాటరీ , గొరిల్లా ప్రొటెక్షన్ తో వచ్చిన ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్లకి ధీటైన సమాధానాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇందులో oreo అప్డేట్ కూడా ఇవ్వడం జరిగినది. శాంసoగ్ వంటి కంపెనీలు తమ ఫ్లాగ్ షిప్ ఫోన్లను 50 వేల పైన ఖరీదు ఉంచి మార్కెట్లోకి విడుదల చేస్తున్న నేపధ్యంలో , ఫ్లాగ్ షిప్ ఫోన్ కావాలి అనికోరుకునే అనేకమంది వినియోగదారులుకు నోకియా 8 ఒక ఛాయిస్ గా మారిందనే చెప్పాలి. మార్కెట్లో దీనిఖరీదు ప్రస్తుతం 28000 రూపాయలుగా ఉంది .

NOKIA 6:

ఇది 2017 లో వచ్చిన అన్నీ బడ్జెట్ మొబైల్స్ కి గట్టి పోటీనే ఇచ్చింది. 5.5 ఇంచ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 2.5 కర్వ్డ్ ప్రొటెక్షన్, 16 mp కెమరా, ఫుల్ hd డిస్ప్లే,3 జి‌బి రామ్,32 జి‌బి ఇంటర్నల్ మెమొరీ, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షించుటలో సఫలం అయింది. మార్కెట్లో ప్రస్తుతం దీని ఖరీదు 13500 రూపాయలుగా ఉంది.

Nokia 5 :

బడ్జెట్ లో మోటోరోలా ఫోన్లకి అలవాటు పడిన వినియోగదారులను ఆకర్షించుటకై నోకియా 5 రిలీజ్ అయిందనే చెప్పాలి. 3 జి‌బి రామ్, 5.2 ఇంచ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 16 జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్, 13 MP రేర్ కెమరా, 5 MP ఫ్రంట్ కెమరా, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ తో వచ్చిన ఈ మొబైల్ బడ్జెట్ మొబైల్ లో ఉండవలసిన అన్నీ ఫీచర్లను అందుబాటులో ఉంచింది. ఎక్కువ శాతం నోకియా మొబైల్స్ గొరిల్లా ప్రొటెక్షన్ తోనే రావడం వలన వినియోగదారులను ఆకర్షించుటలో సక్సెస్ అయిందనే చెప్పాలి. మార్కెట్లో ప్రస్తుతం దీని ఖరీదు 11250 రూపాయలుగా ఉంది.

 

 

NOKIA 3:

పదివేల రూపాయలలోపు మొబైల్ తీసుకోవాలి అని కోరుకునే వారికి నోకియా 3 బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు. 5 ఇంచ్ డిస్ప్లే , 2 జి‌బి రామ్, 8 mp రేర్ కేమరా, 8 mp ఫ్రంట్ కెమరా, 2630 mah బాటరీ, 16 జి‌బి ఇంటర్నల్ మెమొరీ , డెడికేటెడ్ మెమరీ కార్డు స్లాట్, 1280x720 రిసొల్యూషన్, మీడియా టెక్ 6737 క్వాడ్ కోర్ ప్రాసెసర్, పోలరైజ్డ్ గొరిల్లా గ్లాస్ తో వచ్చిన ఈ మొబైల్ అంత పోటీ ఇవ్వకపోయినా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కోరుకునే వారికి ఒక బెస్ట్ ఛాయిస్ అనే చెప్పవచ్చు. దీని ఖరీదు ప్రస్తుతం 8000 రూపాయల వరకూ ఉంది.

NOKIA 3310:

నోకియా తన పాత 3310 కు సక్సెసర్ గా తీసుకుని వచ్చిన ఈ మొబైల్ లో ఫీచర్ ఫోన్ లో ఉండవలసిన అన్నీ లక్షణాలను కలిగి నోకియా అభిమానులకు తన ఉనికిని మరోసారి చూపగలిగింది. దీనిలో fm రేడియో, ఎం‌పి3 సాంగ్స్ సపోర్ట్, 16 ఎం‌బి ఇంటర్నల్ మెమొరీ, 32 జి‌బి ఎక్స్పాండబుల్ కార్డ్ స్లాట్ , 2g నెట్వర్క్ , మైక్రో యూ‌ఎస్‌బి సపోర్ట్, 1200 mah బాటరీ తో వచ్చిన ఈ మొబైల్, ఫీచర్ ఫోన్ అభిమానులను ఆకర్షించగలిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
We countdown the best Nokia phones you can buy today more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot